చైనా ఒక పని చేసింది అంటే దాని వెనుక ఏదో కుట్రకోణం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. సైన్యానికి డ్రోన్ల సాయంతో వేడి ఆహారం పంపించడం, హీట్ షెల్టర్లను ఏర్పాటు చేసిందని ప్రపంచానికి చాలా గొప్పగా చూపించుకొంది. ఇప్పుడు టిబెట్ సరిహద్దుకు ‘ది షార్ప్ క్లా’ అనే రోబోలను తరలించింది. దానికి లైట్ వైట్ మెషిన్ గన్స్ అమర్చి ఉన్నాయి. ఆ రోబో సామాగ్రిని సైతం రవాణా చేయగలదు. అలాంటివి టిబెట్ సరిహద్దుకు 88ని తరలించింది. ఎల్ఏసీలో ఇప్పటికే 38 ది షార్ప్ క్లా రోబోలు ఉన్నాయి.
ఇక్కడే అసలు చైనా బుద్ధి బగటబపడింది. అక్కడ చైనా సైన్యం వాతావరణానికి అడ్జస్ట్ కాలేకపోతున్నారు. అందుకే ఇక రోబోలను నమ్ముకుంటోంది. ‘ది ముల్ 200’ మానవరహిత క్యారియర్ వాహనాలను 120 దాకా టిబెట్ సరహిద్దుకు తరలించింది. ఈ వాహనాలు రవాణాకే కాకుండా.. ఆయుధాలు అమర్చి దాడి చేసేందుకు కూడా వాడుకునేందుకు వీలుగా ఉంటాయి. ఈ చర్యలు మొత్తం చూస్తేనే అర్థమవుతోంది చైనా ఎందుకు ఇలా చేస్తోంది అని. మరి అంతటి పర్వత వాతావరణానికి మన శరీరాన్ని మలుచుకోవడం అంత ఈజీ కాదు. అందుకే చైనా సైన్యం ఇంతలా కష్టపడుతున్నారు. చేసేది లేక చైనా కూడా రోబోలను నమ్ముకునేందుకే మొగ్గు చూపుతోంది.
150 ఎల్వైఎన్ఎక్స్ వాహనాలను కూడా తరలించింది. ఈ వాహనంపై శతఘ్నులు, హెవీ మెషిన్ గన్లు అమర్చేందుకు వీలు ఉంటుంది. మినీ మిసైల్ లాంఛర్లను కూడా అమర్చుకోవచ్చు. ఇప్పటికే సైన్యం కోసం ఎక్సోస్కెలిటన్ సూట్లను కూడా అందజేశారని ప్రపంచ మీడియా వెల్లడించింది. ఇదంతా సైన్యంలో స్థైర్యం పెంచి అక్కడి వాతావరణానికి అలవాటు పడేలా చేసేందుకే అని తెలుస్తోంది. 3000 మీటర్ల ఎత్తుకు వెళ్లే కొద్దీ వాతావరణంలో ఒత్తిడి తగ్గి ఆక్సిజన్ 30 శాతం వరకు తగ్గుతుంది. పైకి వెళ్లే కొద్దీ అలాంటి పరిస్థితులే ఉంటాయి. కొన్నిసార్లు 300 మీటర్ల పెరిగే కొద్దీ ఒక రాత్రంతా విశ్రాంతి తీసుకుని పైకి వాళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో సైన్యంపై ఆధారపడుతూనే ఇటు రోబోలను కూడా నమ్ముకుంటోంది చైనా.