సాధారణంగా పర్ఫ్యూమ్ను కొన్ని రకాల పువ్వులు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. కానీ, బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్ వాటితో పాటు తన చెమటను కూడా కలిపి పర్ఫ్యూమ్ను తయారు చేసింది.
పిచ్చి పలు రకాలు అని పెద్దలు అంటూ ఉంటారు. కొంతమందిని చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. వాళ్లు చేసే కొన్ని పనులు మనల్ని ఆశ్చర్యంతో పాటు ‘మీకేమన్నా పిచ్చి పట్టిందా’ అనిపిస్తాయి. బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌ను చూసిన నెటిజన్లు కూడా ‘ ఈమెకు ఏమైనా పిచ్చా?’ అని అనుకుంటున్నారు. ఇంతకీ ఆమె చేసిన పనేంటంటే.. తన సొంత చెమటతో ఆమె పర్ఫ్యూమ్ తయారు చేసింది. ఆ పర్ఫ్యూమ్లను అమ్మకానికి కూడా పెట్టింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని సావోపాలోకు చెందిన 29 ఏళ్ల వెనెస్సా మౌరా మోడలింగ్ రంగంలో రాణిస్తోంది.
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ఆమెకు మంచి పేరుంది. ఆమెకు 2021 సంవత్సరంలో ఓ వింత ఆలోచన వచ్చింది. ఆలోచనను వెంటనే అమల్లో పెట్టింది. వెనెస్సా తన సొంత చెమటతో ఓ పర్ఫ్యూమ్ను తయారు చేసింది. ఆ పర్ఫ్యూమ్ను అమ్మకానికి కూడా పెట్టింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘ మాండరిన్ ఆరెంజ్, బెర్గమోట్ పింక్ పెప్పర్‌తో పాటు ప్రత్యేకంగా నా చెమటను కలిపి ఈ పర్ఫ్యూమ్ను తయారు చేశాను. ప్రతీ పర్ఫ్యూమ్లో 8మిల్లీ లీటర్ల నా చెమటను కలిపాను. ఈ పర్ఫ్యూమ్ డేటింగ్ కోసం బాగా పనిచేస్తుంది.
నా సహజ శరీర వాసన మగాళ్లను ఆకర్షిస్తుంది. అందుకే నేను కొన్ని చుక్కల నా చెమటను కలుపుతున్నాను. నా చెమటే ఈ పర్ఫ్యూమ్ ఫార్ములా.. అది ప్రేమకు, శృంగారానికి ఉపయోగపడుతుంది. పర్ఫ్యూమ్ వాసన చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. అది కచ్చితంగా పని చేస్తుంది. మగాళ్లను ఆకర్షించటానికి మీ మెడకు పర్ఫ్యూమ్ను రాసుకొండి. అంతే వారు మీ ప్రేమలో పడిపోతారు. రెండు రోజుల్లోనే ఇదంతా జరుగుతుంది’’ అని చెప్పుకొచ్చింది. మరి, సదరు బ్రెజిల్ మోడల్ తన చెమటతో పర్ఫ్యూమ్ను తయారు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.