ఉల్కలు, గ్రహశకలాల వల్ల 10 లక్షల సంవత్సరాల్లో ఒకసారి మాత్రమే భూమికి ప్రమాదం ఉంటుందని నాసా అంచనా వేసింది. ప్రొపల్షన్ ల్యాబరేటరీ వెబ్ సైట్ ( నాసా) ప్రకారం ఈ గ్రహశకలాన్ని 2000లో గుర్తించారు. 800 మీటర్ల ఎత్తు, 500 మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంది. ఎక్కువగా మంచు, దూళి కణాలతో నిండి ఉంది. న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ బిల్డింగు అంత పెద్దగా కనిపించే ఈ ఆస్టరాయిడ్ భూమికి సామీప్యంగా రావడం కొంత ఆందోళనకు కలిగించే విషయమే కాకపోతే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈరోజు రాత్రి 8:40 నిమిషాలకు గ్రహశకాలం భూమికి అత్యంత సమీపానికి రానుందని, 8ఇంచుల టెలిస్కోప్ తో ఇది చూడవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమికి అత్యంత సమీపంలోకి గ్రహశకలం రాబోతుంది.
భూమి నుండి 1.4మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఈ గ్రహశకలం తిరగనుంది. 6దశాబ్దాల కాలం తర్వాత మొట్ట మొదటిసారిగా ఇంత సామీప్యంలోకి రావడం ఇదే తొలిసారి. నాసా ప్రకారం 2016 AJ193 అనే పేరుగల ఈ గ్రహ శకలం భూమి మీద ఉన్న ఎన్నో వస్తువుల కంటే పెద్దదిగా ఉండనుంది. గంటకు 94,208కిలోమీటర్ల వేగంతో తిరిగే 1.4కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ గ్రహశకలాన్ని టెలిస్కోప్ సాయంతో చూడవచ్చు.
ఈ ఆస్టరాయిడ్ భూమికి దాదాపు 43 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్లబోతోంది. ఈ దూరం భూమి, చంద్రుడు మధ్య దూరం కంటే ఎక్కువ. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భూ కక్ష్యలో లక్షల కొద్దీ చిన్నా పెద్దా గ్రహశకలాలున్నాయి. అవి ఒక మీటర్ కంటే ఎక్కువ వ్యాసాన్ని కలిగి లేవు. అందువల్ల అవి భూమిని తాకినా పెద్దగా ప్రమాదమేమీ ఉండదు.