గత కొంతకాలంగా ప్రపంచలోని అత్యున్నత పదవులను అలంకరిస్తున్నారు భారత సంతతికి చెందిన వ్యక్తులు. ఈ జాబితాలోకి మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చేరాడు. అతడి పేరు అమిత్ క్షత్రియ. త్వరలో చేపట్టబోయే 'మూన్ టు మార్స్' ప్రయోగానికి సారథిగా నియమించింది నాసా. ఇక ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.
గత కొంతకాలంగా ప్రపంచలోని అత్యున్నత పదవులను అలంకరిస్తున్నారు భారత సంతతికి చెందిన వ్యక్తులు. ఇప్పటికే సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, అజయ్ బంగా లాంటి మరికొందరు ప్రపంచలోని అత్యున్నత కంపెనీలలో అత్యున్నత పదవులు చేపట్టారు. ఈ జాబితాలోకి మరో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి చేరాడు. అతడి పేరు అమిత్ క్షత్రియ. సాఫ్ట్ వేర్, రోబోటిక్స్ ఇంజినీర్ విభాగంలో నిపుణుడు. దాంతో అతడిని నాసా త్వరలో చేపట్టబోయే ‘మూన్ టు మార్స్’ ప్రయోగానికి సారథిగా నియమించింది నాసా. ఇక ఈ ఘనత సాధించిన తొలి భారతీయ వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు అమిత్ క్షత్రియ.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఓ భారీ ప్రాజెక్ట్ ను తలపెట్టింది. మానవాళి ప్రయోజనాల కోసం చంద్రుడు, అంగార గ్రహాలపై నాసా మానవ అన్వేషణ కార్యకలాపాలను నిర్వహించడం కోసం ‘మూన్ టు మార్స్’ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కు భారత సంతతికి చెందిన సాఫ్ట్ వేర్, రోబోటిక్స్ ఇంజినీర్ అమిత్ క్షత్రియను అధిపతిగా నియమించింది. దాంతో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇక చంద్రుడు, అంగారకుడిపై లోతైన అన్వేషణ జరుగుతోంది అని ప్రాజెక్ట్ లోని సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ మెుదటి దశలోనే ఉందని వారు తెలిపారు. అంగారకుడిపై మనుషులు జీవించేందుకు ఈ ప్రాజెక్ట్ దోహదపడుతుందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కాగా మూన్ టు మార్స్ ప్రాజెక్ట్ లో హార్డ్ వేర్ డెవల్ మెంట్, మిషన్ ఇంటిగ్రేషన్, రిస్క్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారిస్తుంది. అదీకాక ఈ కొత్త ప్రాజెక్ట్ లో ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్, స్పేస్ లాంచ్ సిస్టమ్, సపోర్టింగ్ గ్రౌండ్ సిస్టమ్ లాంటి మరెన్నో లోతైన అంశాలు ఉన్నట్లుగా ప్రాజెక్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఇక అమిత్ క్షత్రియ అంతరిక్ష రంగంలో 2003 నుంచి ఉన్నారు. అంటే దాదాపుగా ఆయన ఈ రంగంలో 20 సంవత్సరాల నుంచి తన సేవలను అందిస్తూ వస్తున్నారు. మరి నాసా కొత్త ప్రాజెక్ట్ కు ఓ భారత సంతతికి చెందిన వ్యక్తి నియమించబడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Meet #AmitKshatriya, Indian-origin #NASA engineer responsible for sending humans to #Mars https://t.co/G3oTsG8rPn
— DNA (@dna) March 31, 2023