Ganesh Temple Street: ఈ ప్రపంచంలోని చాలా దేశాల్లో హిందూ దేవుళ్ల గుళ్లు ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినవి అయితే, మరికొన్ని ఈ మధ్య కాలంలో కట్టించినవే. అమెరికాలో భారత వలసలు పెరిగిన తర్వాత అక్కడ కూడా హిందూ దేవాలయాలు పెరిగాయి. అమెరికాలోని హిందూ టెంపుల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా 1977లో న్యూయార్క్‌లో మహా వల్లభ గణపతి దేవాలయాన్ని నిర్మించింది. ఈ దేవాలయం గణేష్ టెంపుల్‌గా ప్రఖ్యాతి పొందింది. అంతేకాదు! నార్త్ అమెరికాలోని మొదటి, పాతదైన దేవాలయం ఇది. ఆ దేవాలయం క్వీన్స్ కౌంటీలోని ఫ్లషింగ్‌లో ఉంది. ఈ దేవాలయం బయట ఉన్న రోడ్డును బ్రౌన్ వీధి అని పిలుస్తారు.
మత స్వాతంత్ర్యం కోసం, బానిసత్వ వ్యతిరేకంగా పోరాటాలు చేసిన జాన్ బ్రౌన్ పేరు మీద ఈ వీధికి ఆ పేరు వచ్చింది. శనివారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆ వీధికి మరో పేరు పెట్టారు. ‘‘గణేష్ టెంపుల్ స్ట్రీట్’’గా నామకరణం చేశారు. గత డిసెంబర్ నెలలో బ్రౌన్ వీధికి ‘‘గణేష్ టెంపుల్ స్ట్రీట్’’ అని మరో పేరు పెట్టాలనే దానిపై ఓ కమెటీ ఏర్పడింది. ఈ కమెటీకి పీటర్ కూ ఛైర్మన్‌గా వ్యవహరించారు. తాజాగా, ఈ కమెటీ ఆ పేరును ఆమోదిస్తూ రిపోర్టు ఇచ్చింది. ఆలయ కమెటీ సోషల్ మీడియా వేదికగా భక్తులకు, యజమాన్యానికి బోర్డు మెంబర్స్‌కు, పీటర్ కూ, అతడి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఇంటి పేరు కోసం భార్యాభర్తలు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు?