నేటి తరం పిల్లలు ఆలోచనలలోను వారి ప్రవర్తనలోను కాలం మారుతున్న కొద్ది మార్పులు సంభవిస్తుంటాయి. ఇక మరీ ముఖ్యంగా రెండు మూడు సంవత్సరాల పిల్లలు వారి చేసే అల్లరి గురించి మాత్రం ఎంత చెప్పినా తక్కువే. పిల్లలు ఉన్న ప్రతీ ఇంట్లో వారి అల్లరికి తల్లిదండ్రులు తట్టుకోలేకపోతుంటారు. మాటకు మాట మాట్లాడుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. ఇక నడక నేర్చిన పిల్లలు మాత్రం ఎక్కడ నిలవక అందరినీ పరుగులు పెట్టిస్తు ఉంటారు.
తాజాగా ఇలాంటి ఘటనే ఓ స్టేడియంలో జరిగింది. అమెరికాలోని ఓ ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా రెండేళ్ల బాలుడు తల్లిని వదిలి ఏకంగా గ్రౌండ్‌లోకి పరుగు పెట్టాడు. ఇక తల్లి ఖంగారు పడి అటు ఇటు చూసే సరికి గ్రౌండ్‌లో దర్శనమిచ్చాడు. దీంతో వెంటనే తల్లి గ్రౌండ్‌లోకి దూకి పట్టుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ బుడతడు ఎంతకు దొరకక తల్లికి చెమటలు పట్టించి ఆ తర్వాత తల్లి చేతికి చిక్కాడు. దీనిని చూసిన గ్రౌండ్‌లోని ఆటగాళ్లు, వీక్షకులు అందరూ కడపుబ్బ నవ్వటం మొదలు పెట్టారు. తాజాగా ఈ నెట్టింట్లో బాగా వైరల్‌గా మారింది. మీరు ఓ సారి లుక్కేయండి.