సాధారణంగా పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయింపబడుతాయి అంటారు. అయితే వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ మధురమైన ఘట్టం. ఎవరి సాంప్రదాయ, ఆచారాల ప్రకారం వారు తమ స్థాయికి తగ్గట్టు వివాహాలు చేసుకుంటారు. ఈ మధ్య కొన్ని వివాహ వేడుకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి వార్తల్లో నిలిచింది. అంతగా వార్తల్లో నిలవడానికి ఆ పెళ్లిలో ఏం ప్రత్యేకత అనుకుంటున్నారా? ఇక్కడ వధువుకు బదులు వరుడు మొసలిని పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెలితే..
శాన్ పెడ్రో హువామెలులా మేయర్ సెటోర్ హ్యూగో సాంప్రదాయ, ఆచారాల ప్రకారం మొసలిని ఘనంగా వివాహం చేసుకున్నాడు. ఈ సందర్భంగా మొసలిని తెల్లటి పెళ్లి దుస్తులతో పెళ్లి కూతురులా అలంకరించారు. ఆ తరువాత మేయర్ మొసలిని వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ముసలికి ముద్దు పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా మొసలిని వివాహం చేసుకున్న తర్వాత తమను తాము దైవ పురుషులుగా భావిస్తారు.
ఈ విచిత్రమైన ఆచారం మెక్సికోలో ఎప్పటి నుంచో కొనసాగుతుందని.. ఇక ఉన్నతమైన పాలక వర్గంలో ఉన్నవారు మొసలిని పెళ్లి చేసుకుంటారని అంటున్నారు. ఇలా మొసలిని పెళ్లి చేసుకోవడం వల్ల పట్టణ ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో విరాజిల్లుతారని ప్రజల నమ్మకం. సాధారణంగా ఒక పెళ్లి తంతు జరిగినట్టే జరుగుతుంది.. బంధు మిత్రులను ఆహ్వానించి.. మొసలి పేరు కూడా ప్రస్తావిస్తారు. ఈ వింతైన వివాహ వేడుకకు వేలాది మంది హాజరయ్యారు. విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
In an age-old ritual, a Mexican mayor married his alligator bride to secure abundance. Victor Hugo Sosa sealed the nuptials by kissing the alligator’s snout https://t.co/jwKquOPg93 pic.twitter.com/Vmqh4GpEJu
— Reuters (@Reuters) July 1, 2022