పెళ్లి అనేది ప్రతి ఒక్క జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం. అందుకే తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని కోరుకుంటారు. ఇలా ఎన్నో పెళ్లిళ్లు సందడి సందడిగా జరుగుతుంటాయి. కొన్ని పెళ్లిళ్లలో మాత్రం విషాదాలు చోటుచేసుకుంటాయి.
పెళ్లి అనేది ప్రతి ఒక్క జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకం. అందుకే తమ పెళ్లిని ఎంతో ఘనంగా చేసుకోవాలని కోరుకుంటారు. అలానే ఎంతో మంది తమ వివాహాన్ని ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇలా ఎన్నో పెళ్లిళ్లు సందడి సందడిగా జరుగుతుంటాయి. కొన్ని పెళ్లిళ్లలో మాత్రం విషాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఓ తండ్రి..తన కుమార్తె పెళ్లి జరిగిన క్షణాల్లో కుప్పకూలిపోయారు. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని విఠల్‌నగర్‌కు చెందిన ఎలిగేటి శంకర్ (56)కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవలే తన కుమార్తె నిశ్చితార్థం నిర్వహించాడు. ఈ క్రమంలో తాజాగా బుధవారం స్థానిక సింగరేణి కమ్యూనిటీ హాల్‌లో తన కుమార్తె ఘనంగా జరిపించాడు. ఆయన బంధువులు, స్నేహితులు పెళ్లికి హాజరయ్యారు. పెళ్లిలో అందరు డ్యాన్స్ లు చేస్తూ తెగ సందడి చేశారు. అలా వివాహ వేడుక ముగిసి తరువాత బంధువులు, కుటుంబ సభ్యులతో కలసి శంకర్ సందడి వాతావరణం నెలకొంది.
అప్పటి వరకు కుమార్తె పెళ్లి వేడుకను కళ్లారా చూసిన శంకర్ అలసటగా ఉండి కుర్చీలో కూర్చున్నారు. కొద్ది సేపటికి కూర్చున్న శంకర్ కుర్చీలోనే కుప్పకూలాడు. వెంటనే శంకర్ ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శంకర్ ను పరీక్షించిన వైద్యులు.. ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న శంకర్.. ఆ కారణంగానే మృతి చెంది ఉంటాడని బంధువులు అంటున్నారు. శంకర్ మృతితో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. భంజత్రీలో మోగిన పెళ్లి ఇంట .. రోదనలు వినిపించాయి. శంకర్ కుటుంబ సభ్యుల రోదన చూసిన స్థానికుల హృదయాలు బరువెక్కాయి.