ఈ రోజుల్లో వయసు తేడా లేకుండా ప్రతీ ఒక్కరిని భయపెడుతున్న అతి పెద్ద అనారోగ్య సమస్య గుండెపోటు. ఇటు 6 ఏళ్ల పిల్లల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు అందరినీ అ సమస్య వెంటాడుతోంది. అయితే ఇటీవల ఓ బాలుడు ఆడుకుంటూ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా మరో వ్యక్తి గుండె పోటుతో మరణించాడు. బ్యాడ్మింటన్ ఆడుతూ ఆ వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది మస్కట్ లోని ఓ ప్రాంతం. ఇక్కడే కేరళకు చెందిన ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతని వయసు 38 ఏళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇతనికి చిన్నప్పటి నుంచి క్రీడలు అంటే చాలా ఇష్టం. అనేక నేషనల్ క్రీడా పోటీల్లో కూడా పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే ఆ వ్యక్తి ఇటీవల స్థానికంగా కోర్టు ఆవరణలోనే ఫ్రెండ్స్ తో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. అప్పటి వరకు ఎంతో ఉషారుగా ఆడుతున్న ఆ వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే గమనించిన తోటి స్నేహితులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో అతడు గుండెపోటుతో అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు.
అనంతరం ఇదే విషయాన్ని అతని భార్యకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న అతని భార్య, పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపించారు. కొద్ది గంటల వరకు మాతో పాటు ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడంతో ఆ మహిళ గుండెలు పగిలేలా ఏడ్చింది. అయితే అతడు బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. వరుస గుండెపోటు మరణాలతో ప్రతీ ఒక్కరూ భయందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.