పాపకు ‘‘కాగ్నిటల్ సెంట్రల్ హైపోవెన్‌షియల్ సిండ్రోమ్’’ ఉంది. ఈ సిండ్రమ్ కారణంగా చిన్నారి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోంది. తల్లిదండ్రుల కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఆ షో చూసిన ప్రతీసారి..
ఆ పాపకు ఆరేళ్లకు. పైకి చూడ్డానికి అందరు బాలికల్లానే కేరింతలు కొడుతూ ఆడుతూ పాడుతూ తిరుగుతుంది. కానీ, ఓ టీవీ షో చూస్తే మాత్రం పాప ప్రాణాల మీదుకు వస్తుంది. ఆ షో కారణంగా ఆ పాప ఇప్పటికే చాలా సార్లు చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. ఇంతకీ ఆ టీ వీ షో ఏంటి? ఆ పాప ఎందుకు అలా ఆ టీవీ షో చూసిన ప్రతీసారి ప్రాణాపాయంలోకి వెళుతోంది? అన్న విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన స్టార్ బౌయెర్ అనే 48 ఏళ్ల వ్యక్తి, ఆండ్రూ బౌయెర్ అనే 44 ఏళ్ల మహిళ భార్యాభర్తలు. వీరికి ఆరేళ్ల శాడీ అనే కూతురు ఉంది.
ఆ కూతురు అందరు పిల్లల్లలానే ఎంతో చురుగ్గా ఆడుతూ పాడుతూ ఉంటుంది. పాపకు ‘‘పెప్ప పిగ్’’ అనే టీవీ షో అంటే చాలా ఇష్టం. అయితే, ఈ టీవీ షో చూసిన ప్రతీసారి పాప ప్రాణాల మీదకు వస్తోంది. ఎందుకంటే.. పాపకు ‘‘కాగ్నిటల్ సెంట్రల్ హైపోవెన్‌షియల్ సిండ్రోమ్’’ ఉంది. ఈ వ్యాధి చాలా అరుదైనది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 1000 కేసులు మాత్రమే ఉన్నాయి. ఈ వ్యాధి కారణంగా శ్వాస తీసుకోవటంలో ఆమెకు ఇబ్బంది ఉండేది. దీంతో ఆమెకు ఆపరేషన్ ద్వారా ఓ ట్యూబ్‌ను గొంతులో అమర్చారు వైద్యులు. ఇక, అప్పటినుంచి సాధారణంగా ఉండగలుగుతోంది. అయితే, పాప దేని మీదైనా ఎక్కువ ఏకాగ్రత పెడితే మాత్రం ఇబ్బంది తప్పటం లేదు. శ్వాస తీసుకోవటంలో ఆటంకం ఏర్పడుతోంది.
శరీరం మొత్తం నీలం రంగులోకి మారుతోంది. ఈ నేపథ్యంలోనే పాపను వెంటిలేటర్‌పై పెట్టాల్సి వస్తోంది. లేకపోతే కొన్ని నిమిషాల్లోనే పాప చనిపోయే పరిస్థితి ఉంది. కేవలం ఒక్కసారి కాదు.. పెప్ప పిగ్ టీవీ షో చూసిన పలుసార్లు పాప చావు అంచుల వరకు వెళుతోంది. తల్లిదండ్రులు దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాపను ఆ టీవీ షో చూడకుండా ఆపుతున్నారు. పాప తల్లి దాదాపుగా ఆరేళ్లుగా సరిగా నిద్రపోవటంలేదు. శాడీకి ఎప్పుడు ఏమవుతుందోనన్న భయంతో రాత్రిళ్లు నిద్ర మేల్కొంటోంది. పాప పరిస్థితి వెంటి లేటర్ లేకుండా నిద్రపోలేకుండా తయారైంది. అందుకే వెంటిలేటర్‌కు ప్రత్యామ్నాయంగా వేరే వస్తువును చిన్నారికి అమర్చటానికి తల్లిదండ్రులు డబ్బు సేకరిస్తున్నారు. మరి, పాప పరిస్థితిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.