బ్రిటన్ లో జరుగుతోన్న కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలకం బృందంలోని 10 మందికి సభ్యులు అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యారు. శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వారి వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిదిమంది అథ్లెట్లు సహా ఒక మేనేజర్ కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా అధికారి ఒకరు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే..
కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి 160 తో కూడిన క్రీడకారుల బృందం ఇంగ్లాడ్ వెళ్లింది. ఈ బృందంలో గత వారం నుంచే ముగ్గురు కనిపించకుండా పోయారని, ఆ తర్వాత మరో ఏడుగురు అదృశ్యమయ్యారని, దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రీలంక క్రీడా అధికారి తెలిపారు. బహుశా ఉపాధి కోసం వారు బ్రిటన్ లోనే ఉండిపోయేందుకు ఈ విధంగా వ్యవహరించి ఉండోచ్చని శ్రీలంక అధికారులు అనుమానిస్తున్నారు. వారి వారి ఈ వెంట్లు పూర్తికాగానే 10 మంది అదృశ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఈ అదృశ్యంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్రీడాకారుల కోసం గాలించగా తొలుత అదృశ్యమైన ముగ్గురు.. జుడోకా చమీలా దిలాని, ఆమె మేనేజర్ అసేల డి సిల్వా, రెజ్లర్ షనిత చతురంగలను గుర్తించారు. అయితే, స్థానిక చట్టాలను వారు ఉల్లంఘించలేదని గుర్తించారు. అలాగే, వారి వద్ద 6 నెలల కాలంపాటు చెల్లుబాటు అయ్యే వీసాలు ఉండడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని శ్రీలంక అధికారి తెలిపారు.
గత ఏడాది అక్టోబరులో నార్వేలోని ఓస్లో లో ప్రపంచ ఛాంపియన్ షిప్ టోర్మమెంట్ సందర్భంగా శ్రీలంక రెజ్లింగ్ మేనేజర్ తన జట్టును వదిలిపెట్టి అదృశ్యమయ్యారు. 2014లో కూడా దక్షిణ కోరియాలో జరిగిన ఆసియా క్రీడల సందర్భంగా ఇద్దరు శ్రీలంక అథ్లెట్లు కనిపించకుండా పోయారు. ఇదిలా ఉండగా .. శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆ 10మంది క్రీడాకారులు కావాల్సి అదృశ్యమైనట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బాక్సింగ్‌లో భారత్‌కు పతకం అందించిన తెలంగాణ బిడ్డ!
ఇదీ చదవండి: గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన భవినా పటేల్!