ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో అదృష్టం తలుపు తడుతుందని పెద్దల నమ్మకం. అలాంటి సందర్భాల్లో కటిక పేదరికంలో ఉన్నవాళ్లు కూడా అపర కుబేరులుగా మారిపోతుంటారు. చేతిలో చిల్లిగవ్వలేని వారు అదృష్టం వరించి కోటేశ్వర్లు అవుతుంటారు. అలానే అనేక మంది సామాన్యులు కూడా అదృష్టం వరించి.. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతుంటారు. అచ్చం అలాంటి మార్పే ఓ 18 ఏళ్ల యువతి విషయంలో జరిగింది. ఆమె గురించి తెలిస్తే.. అదృష్టం అంటే ఈమెదే అని అనక మానరు. సరదగా కొన్న లాటరీ టికెట్ ఆమెపై కోట్ల వర్షాన్ని కురిపించింది. ఆమె కొనుగోలు చేసిన లాటరీకి ఏకంగా రూ.290 కోట్లు తగిలింది. దీంతో సదరు యువతి షాక్ కి గురయ్యారు. ఆమె బంధువులు, స్నేహితులు శుభాకాంక్షాలు తెలియజేస్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కెనడాలోని అంటారియో ప్రాంతానికి చెందిన జూలియోట్ లామర్ అనే 18 ఏళ్ల యువతి తొలి ప్రయత్నంలోనే భారీ లాటరీ తగిలింది. ఎప్పుడు లాటరీలు, లక్ అనే వాటిపై జూలియోట్ అంతగా ఆసక్తి చూపించదు. అయితే ఒకసారి తొలిప్రయత్నంగా ఓ లాటరీని కొనుగోలు చేసింది. అనంతరం ఆ లాటారీని కుటుంబ సభ్యులకు ఇచ్చేసి..దాని గురించే మరచిపోయింది. డ్రాలో గెలుపొందాననే వార్త తెలిసేవరకు కూడా తాను లాటరీ టికెట్ కొనుగోలు చేసిన సంగతినే లామర్ మర్చిపోయిందంట. భారీ మొత్తంలో డబ్బులు రావడంతో ఈ 18 ఏళ్ల యువతి ఆనందంలో మునిగితేలుతుంది.
అతిపిన్న వయస్కురాలైన లామర్ 48 మిలియన్ డాలర్ల భారీ డబ్బులను లాటరీలో గెలుచుకున్నట్లు అంటారియో లాటరీ అండ్ గేమింగ్ కార్పోరేషన్ తెలిపింది. అంటే ఇండియన్ కరెన్సీలు సుమారు రూ.290 కోట్లు అన్నమాట. ఈ కెనడాలోని లాటరీ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్న అతి పిన్నవయస్కురాలిగా లామర్ రికార్డ్ సృష్టిచింది. అందులోనూ తొలి ప్రయత్నంలోనే ఇంత పెద్ద జాక్ పాట్ తగలడం విశేషం. ఇక లాటరీ గురించి లామర్ మాట్లాడుతూ.. ” ఓ రోజు సరదాగా మా తాతతో కలసి బయటకు వెళ్లాను. ఆ సమయంలో లాటరీ కొనాలని సూచించాడు. నాకు ఇంతకుముందు ఎప్పుడూ కూడా లాటరీ టికెట్ కొన్న అనుభవం లేకోపవడంతో ఏం అడగాలో అర్ధం కాలేదు. దీంతో మా నాన్నకు ఫోన్ చేసిన తరువాత లోట్టో 6-49 క్విక్ పిక్ కొన్నాను.
నా మొదటి లాటరీ టికెట్ ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు రావడం నమ్మలేకపోతున్నాను” అంటూ లామర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. లాటరీలో వచ్చిన డబ్బును జాగ్రత్తగా పెట్టుబడులు పెడతానని లామర్ చెప్పుకొచ్చింది. ఆమెకు భారీ మొత్తం లాటరీ తగలడంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులు లామర్ కు అభినందనలు తెలియజేశారు. మరి.. ఇలా తొలి ప్రయత్నంలో రూ.290 కోట్ల లాటరీ గెలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
An 18-year-old girl from Sault Ste. Marie won $48 million through the OLG Lotto Max, becoming the youngest person in Canadian history to win a prize that large.
The catch? It was her first-ever ticket.https://t.co/pbBvup70Q4
— CityNews Toronto (@CityNewsTO) February 3, 2023