అనుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపితమైన ఘటనలు ఎన్నో. సాధించాలన్న లక్ష్యం ఉండాలే కానీ విజయం మన ముంగిటకు వస్తుందని చాలా మంది విజేతలు నిరూపించారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన బొంత తిరుపతిరెడ్డి కూడా ఆ విజేతలో జాబితాలో చేరారు.
“అనుకుంటే కానిది ఏమున్నది.. సాధించలన్నా తపన ఉండాలే కానీ కొండలనైనా పిండి చేయోచ్చు” అని పెద్దలు చెప్తుంటారు. ఆ మాటలు అక్షర సత్యమని, మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడని నిరూపితమైన ఘటనలు ఎన్నో. సాధించాలన్న లక్ష్యం ఉండాలే కానీ విజయం మన ముంగిటకు వస్తుందని చాలా మంది విజేతలు నిరూపించారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన బొంత తిరుపతిరెడ్డి కూడా ఆ విజేతలో జాబితాలో చేరారు. పేదరికాన్ని ఎదిరించి.. సోషల్ మీడియా సాయంతో..యూట్యూబ్‌లో పాఠాలు నేర్చుకుంటూ ప్రభుత్వ కొలువులను సాధించాడు. మరి.. ఆ సక్సెస్ స్టోరీ వెనుక ఉన్న హార్డ్ స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది మొదటి, రెండవ ప్రయత్నంలోనే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలని అనుకుంటూ ఉంటారు. ఓ రెండు ప్రయత్నాల్లో విజయం సాధించలేకపోతే నిరుత్సాహ పడుతుంటారు. కానీ, తిరుపతి రెడ్డి మాత్రం ఆధునిక టెక్నాలజిని ఉపయోగించి కొలువును సాధించాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి దగ్గర నుంచి చూసిన తిరుపతి రెడ్డి తన దగ్గర ఉన్న ఫోన్‌నే గురువుగా భావించి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యాడు. ఏకంగా తాను సాధించాలనుకున్న రైల్వే ఉద్యోగాన్ని కొట్టేశాడు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పోసుపల్లె గ్రామానికి చెందిన బొంత చిన్నకొండారెడ్డి, మహాలక్ష్మి దంపతుల కుమారుడు తిరుపతిరెడ్డి. వీరిది సాధారణ రైతు కుటుంబం.తిరుపతిరెడ్డి తల్లిదండ్రులు రోజువారి కూలీ పనులు చేస్తూ అతడిని బీఎస్సీ కంప్యూటర్ (డిగ్రీ) వరకు చదివించారు.
అయితే తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన అతడు తన కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కించాలనుకున్నాడు. రైల్వే ఉద్యోగం తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే కోచింగ్ సెంటర్లకు డబ్బులు పెట్టే స్థోమత లేక.. స్వంతంగా ప్రిపరేషన్ ఏర్పాట్లు చేసుకున్నాడు. వ్యవసాయంలో తల్లిదండ్రులకు సాయంగా ఉంటూ ప్రభుత్వ వెబ్ సైట్లు, యూట్యూబ్‌లో వచ్చే వీడియోలను చూసి సొంతంగా ఒక బుక్ తయారు చేసుకొని నిరంతరంగా కష్టపడేవాడు. ఈ క్రమంలో ఎన్‌టీటీసీ-2019 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అతడు కమర్షియల్ కం టికెట్ క్లర్క్ పోస్టుకు దరఖాస్తు చేసాడు. అయితే కరోనా కారణంగా రెండేళ్లు పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగపర్చుకుని మరింత ప్రిపరేషన్ తీసుకున్నాడు.
2021 లో పరీక్షలు రాశాడు. ఆ పరీక్షలో క్వాలిఫై అయ్యాడు. మళ్లీ తిరిగి 2022 లో మెయిన్స్ రాసి ఫలితాల కోసం ఎదురుచూసాడు.ఇంతలోనే రైల్వే శాఖ గ్రేడ్-4 ఉద్యోగాల ఎంపికలో నిర్యహించిన పరీక్షలో విజయం సాధించాడు. అతడికి ఉద్యోగం రాగా, బుధవారం బెంగళూరులో చేరాల్సి ఉంది. అయితే మరికొద్దీ నిమిషాల్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉన్న సమయంలో గతంలో ఎన్‌టీటీసీ-2019 నోటిఫికేషన్ సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. అతడు కమర్షియల్ కం టికెట్ క్లర్క్ ఉద్యోగంలో ఎంపికైనట్లు తెలియడంతో తిరుపతిరెడ్డి ఆనందానికి అవధులులేవు. గ్రేడ్ -4 ఉద్యోగంలో చేరకుండా బెంగళూరు నుంచి తన స్వగ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. తాను వైఫే అనే చానల్ ను ఫాలో అవుతూ.. నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ.. రోజుకు 5 గంటల పాటు సెల్ఫ్ శిక్షణ తీసుకున్నానని తెలిపారు.