నేటి తరం యువత తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిలకంటే ప్రేమ పెళ్లిలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ప్రేమించిన వాడిని దక్కించుకునేందుకు తల్లిదండ్రులను సైతం ఎదురించి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి లవ్ మ్యారేజ్ లు రోజు చాలానే జరుగుతున్నాయి. ఇలాగే ఓ యువతి ప్రియుడితో వెళ్లిపోతున్నానంటూ ఓ లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటన తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగద్గిరిగుట్ట పరిధిలోని రోడామేస్త్రినగర్ లో గోకల బాల్ రాజ్ గౌడ్, స్వప్న అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మనీషా (24) అనే కూతురు ఉంది. ఉన్నత చదువులు చదివిన మనీషా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అయితే ఈ యువతి గత కొంత కాలం నుంచి వంశీ అనే యువకుడితో సన్నిహితంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా శనివారం రోజు మనీషా ఉన్నట్టుండి ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఖంగారు పడ్డారు. అటు ఇటు వెతికే క్రమంలోనే.. ఆ తల్లిదండ్రులకు కూతరు రాసిన లెటర్ ఇంట్లో దొరికింది. అందులో ఏముందంటే?.. నేనే వంశి అనే యువకుడితో వెళ్లిపోతున్నా అని రాసి ఉంది. ఇక ఆ యువతి ఫోన్ సైతం ఇంట్లో ఉంచి వెళ్లిపోయింది.
ఈ ఘటనపై మనీషా తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. వంశీతో వెళ్లిపోతున్న అని లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మనీషా తీరు కరెక్టేనా? అసలు నిజంగానే ప్రియుడితోనే వెళ్లిపోయిందా?. లేక మరేదైన జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.