బిడ్డకి ప్రశాంతత లేకుంటే అమ్మ ప్రేమ ఎంతకైనా తెగిస్తుంది. నిత్యం తన కూతురిని వేధింపులకు గురు చేస్తూ, కష్టాలు పెడుతున్న అల్లుడిని తిరిగిరాని లోకాలకి పంపింది ఓ అత్త. తన కూతురు మంగళ సూత్రాన్ని అమ్మే స్వయంగా తెంచేసింది. కష్టాల కాపురం కన్నా, తన కూతురు ప్రశాంతంగా ఉండటమే నయం అని దారుణానికి ఒడి కట్టింది. ఏకంగా అల్లుడిపై పెట్రోల్ పోసి, నిప్పు అంటించింది. హైదరాబాద్ లోని మల్కాజ్‌గిరి పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
సికింద్రాబాద్‌లో నివశించే దండుగళ్ల నాని కారు డ్రైవర్. అతనికి జేఎల్‌ఎన్‌ఎస్ నగర్‌లో నివసించే అనిత అలియాస్ సోని అనే యువతితో 2015లో వివాహం జరిగింది. తరువాత వీరికి ఓ పాప కూడా జన్మించింది. కానీ.., తరువాత మద్యానికి గురైన నాని నిత్యం భార్యకి నరకం చూపించండం మొదలు పెట్టాడు. ఈ విషయంలో పెద్దల సమక్షంలో ఎన్నిసార్లు పంచాయతి జరిగినా.., నాని తీరు మారలేదు.దీంతో.., భర్త తీరుతో విసుగు చెందిన సోని.. భర్తపై పోలీస్ లకి కంప్లైంట్ ఇచ్చింది. అప్పటి నుండి తల్లి దగ్గరే ఉండిపోయింది సోని.
ఈ క్రమంలో ఈ నెల 13న తన కూతురును చూసుకోవడానికి నాని అత్తగారి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో కూడా భార్యభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. అల్లుడు తన ముందే కూతురిని దూషించడంతో ఆ అత్త పార్వతమ్మ సహనాన్ని కోల్పోయింది. కూతురితో కలసి అల్లుడిపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో.., శరీరం చాలా వరకు కాలిపోయింది. ఇక గాంధీలో చికిత్స పొందుతూ నాని మృతిచెందాడు. ఆవేశంతో చేసిన పనికి అత్త పార్వతమ్మ ఇప్పుడు జైలు పాలు కావాల్సి వచ్చింది. అయితే.., అల్లుడిని చంపినందుకు ఆ అత్తలో కాస్త కూడా ప్రశ్చాత్తాపం లేకపోవడం విశేషం. మరి.. ఈ ఘటనలో అత్త చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.