ఈ ప్రపంచంలో,చాలా విచిత్రమైన ఆచారాలు ఉన్నాయి, కొన్ని ఇంతకు ముందు ఎప్పుడూ విని ఉండము.ఇలాంటి పాత ఆచారాలు చాలా ఉన్నాయి, వీటిని నేటి హైటెక్ కాలంలో కూడా ఇప్పటికీ అనుసరిస్తున్నారు. ఈ గ్రామ మహిళలుఐదు రోజులు బట్టలు లేకుండా ఉంటారు. ఈ విషయం వినడానికి చాలా వింతగా అనిపిస్తుందికానీ ఇది ఖచ్చితంగా నిజం.ఇండియా సంస్కృతి, సాంప్రదాయాలకు పెట్టింది నిలయం.
భారతదేశంలోస్త్రీలకు ఎటువంటి గౌరవాన్ని ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దేశంలో ఎన్నో రకాల ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయి. కొన్ని ప్రదేశాలలో అయితే పరాయి స్త్రీలను కూడా కన్నతల్లి గా భావిస్తారు. మహిళలను ఎంతో ప్రత్యేకంగా చూసే మన భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో ఉన్న వింత ఆచారాలు పద్ధతులు తెలిస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది.
భారత దేశంలోనే ఒక ప్రాంతం ఉంది అక్కడ ఆడవారు ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఐదు రోజుల పాటు ఉపవాసాలు చేస్తారట. పూర్తి వివరాల్లోకి వెళితే…హిమాచల్ ప్రదేశ్ పర్యాటకులకు అనుకూలమైన రాష్ట్రం.ఈ రాష్ట్రానికి చాలా ప్రదేశాలనుంచి పర్యాటకులు వచ్చి వెళ్తుంటారు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు, మనాలి అనే ప్రదేశాలు పర్యాటక ప్రదేశాలుగా పిలువబడుతున్నాయి.
ఈ రాష్ట్రంలోనే కులు అనే జిల్లాలో పిని అనే గ్రామం ఉంది. ఇది సముద్రమట్టానికి దాదాపు గా 1950 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ గ్రామానికి నిత్యం అనేక ప్రదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు . అయితే ఇక్కడి ప్రజలు ఎక్కువగా గైన్ అనే దేవతను కొలుస్తుంటారు.ఈ దేవత రాక్షసులను సంహరించింది అని అక్కడి వారి నమ్మకం. ప్రతి ఏడాదికి ఈ దేవతను కొలుస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.
ఐదు రోజుల పాటు మహిళలు శరీరంపై ఎలాంటి దుస్తులు వేసుకోకుండా, చిన్న బట్ట లాంటిది కట్టుకొని ఉపవాసాలు చేస్తుంటారు. రోజులో కొంచెం ఆహారం మాత్రమే తీసుకొని ఉంటారు. ఇలా ఈ ఆచారాన్ని ఎప్పటినుంచో పాటిస్తూ ఉన్నారు. అయితే విదేశాల నుంచి అక్కడికి వచ్చిన పర్యాటకులు చూసి ఇండియాలో కూడా ఇలాంటి వింత ఆచారాలు ఉన్నాయా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆచారం అక్కడ ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది .మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి .