ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల తయారు చేసి, వాటిపై లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేశారంటూ అర్జున్ సురవరం సినిమాలో హీరోను అరెస్టు చేస్తారు. తీరా హీరోనే నకిలీ సర్టిఫికేట్ల వెనుక పెద్ద స్కామ్ ఉందని బట్టబయలు చేస్తాడు. అయితే ఇది సినిమా.. కానీ ఇదే కథను నిజ జీవితంలో అమలు చేశాడో సినీ దర్శకుడు.
విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయి నకిలీ సర్టిఫికెట్లు. కూరగాయాల మాదిరి చాలా విరివిగా నకిలీ సరిఫ్టికెట్లు దొరుకుతున్నాయి. ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లను తయారు చేసి, వాటిపై లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేశారంటూ అర్జున్ సురవరం అనే సినిమాలో ఏ తప్పు చేయని హీరోను అరెస్టు చేస్తారు. తీరా హీరోనే నకిలీ సర్టిఫికేట్ల వెనుక పెద్ద స్కామ్ ఉందని బట్టబయలు చేస్తాడు. అయితే ఇది సినిమా.. కానీ ఇదే కథను నిజ జీవితంలో అమలు చేశాడో సినీ దర్శకుడు. ఏ మాత్రం అనుమానం రాకుండా .. ఒరిజనల్ సర్టిఫికెట్లలా నకిలీ వాటిని అంగట్లో అమ్మకానికి పెట్టాడు. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో వీరి గుట్టు రట్టయింది. వివరాల్లోకి వెళితే..
డబ్బు సంపాదనే ధ్యేయంగా కన్సలెన్టీలతో సంబంధాలు పెట్టుకుని రెండేళ్లుగా చదువు పూర్తి చేయని విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నాడు సినీ దర్శకుడు. ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరంటే శివాజీ, ప్రీతా విజయ్ కుమార్ నటించిన వైఫ్ మూవీ దర్శకుడు రావిపల్లి రాంభద్రరావు అలియాస్ రాంబాబు(62) దీనికి ప్రధాన కారకుడని తేలింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు వాసి తాడిశెట్టి రేణుకేశ్(48)కు శ్రీవెంకటేశ్వర కన్సల్టెన్సీ ఉంది. వివిధ రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాల నకిలీ ధ్రువపత్రాలు విక్రయించే హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన రాహుల్ దీక్షిత్‌తో పరిచయం ఏర్పడింది.
అలాగే రావిపల్లి రాంబాబు, అతని బంధువు, హైదరాబాద్ ఎర్రగడ్డలో అప్‌గ్రేడ్ స్టడీ కన్సల్టెన్సీ నిర్వాహకుడు అన్నం దినేశ్(37), యూసుఫ్‌గూడకు చెందిన గొల్లపల్లి శ్రవణ్ (29) తదితరులతో పరిచయం చేసుకున్నాడు. వీరంతా కలిసి రాహుల్ దీక్షిత్ దగ్గర నుండి నకిలీ సర్టిఫికెట్లు తీసుకుని.. ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ తదితర కోర్సులు ధ్రువీకరణ పత్రాలను రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు విక్రయిస్తున్నారు. ఇటీవల కోంపల్లికి చెందిన గొట్టిముక్కల రోహిత్ వర్మకు కూడా ఇలా బీటెక్ ధ్రువ పత్రం విక్రయించారు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్, సరూర్‌నగర్ పోలీసులు రోహిత్ వర్మ, రేణుకేశ్, శ్రవణ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
39 నకిలీ ధ్రువపత్రాలు, 486 హోలోగ్రామ్‌లు, కారు, ఎనిమిది ఫోన్లు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. సినీ దర్శకుడు రాంబాబు, దినేశ్, రాహుల్ పరారీలో ఉన్నట్లు రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహాన్, ఎల్బీనగర్ ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్, ఇన్‌స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. ఈ రెండేళ్ల కాలంలో 70-80 మందికి నకిలీ ధ్రువీకరణ ప్రతాలు విక్రయించనట్లు దర్యాప్తులో తేలింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని అర్నీ యూనివర్సిటీ పత్రాలు ఎలా సంపాదిస్తున్నారనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు. కాసుల కక్కుర్తి కోసం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న ఇటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.