ఇంగ్లండ్- సాధారనంగా మనం హోటల్ కో లేదా రిస్టారెంట్ కో వెళ్లినప్పుడు తిన్నాక బిల్లు కట్టే సమయంలో వెయిర్ టిప్పు కోసం వెయిట్ చేస్తుంటాడు. ఐతే కొంత మంది టిప్పు వేస్తారు, మరి కొందరు బిల్లు మాత్రమే కట్టి వచ్చేస్తారు. టిప్పు వేసినవారి వంక మర్యాదగా చూసే వెయిటర్, టిప్పు వేయని వాళ్ల వంక అదోలా చూడటం అలవాటే అనుకోండి. ఇక టిప్పు వేసే వాళ్లు కూడా ఎంత బిల్లు అయినా 20, 30 మహా అయితే వంద రూపాయలు టిప్పుగా వేస్తారు ఎవరైనా. కానీ ఇంగ్లండ్ లో ఓ కస్టమర్ ఎంత టిప్పు ఇచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.
రిస్టారెంట్ లో తాను చెల్లించాల్సిన బిల్లు కంటే ఏకంగా వందల రెట్లు అధికంగా టిప్ చెల్లించి అందరికీ షాకిచ్చాడు ఓ కస్టమర్. ఆ విషయాన్ని ఆ బార్ యజమాని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లోని న్యూ హాంప్‌షైర్‌లో స్టంబుల్ ఇన్ బార్‌లో జరిగింది. బార్‌కు ఇటీవల ఓ కస్టమర్ వచ్చి చిల్లీ చీజ్ డాగ్స్‌తో పాటు టకీలా డ్రింక్‌ను ఆర్డర్ చేశాడు. అది తాగేశాక వెయిటర్‌ను బిల్ అడిగాడు. లేడీ వెయిటర్ 37.93 డాలర్లు అంటే మన కరెన్సీలో 2,818 బిల్ తెచ్చి ఇచ్చింది. బిల్‌తో పాటు టిప్ కూడా ఇచ్చివెళ్లాడు ఆ కస్తమర్. వెళ్లేటప్పుడు ఒకే దగ్గర ఈ డబ్బు మొత్తం ఖర్చు చేయొద్దని ఆమెకు చెప్పాడు. బార్ లో ఇతర కస్టమర్లు రావడంతో పనిలో బిజీగా ఉన్న ఆ లేడీ బార్ టెండర్, అతడు ఎన్ని డబ్బులు ఇచ్చాడనే విషయాన్ని పరిశీలించలేదు.
బార్ మూసేశాక ఆ కస్టమర్ ఇచ్చిన టిప్ చూసి ఆమెకు కళ్లు బైర్లు కమ్మాయి. ఏకంగా 16 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో 11 లక్షల 86 వేల 867 చూసుకొని ఆమె నమ్మలేకపోయింది. దీంతో ఆ కస్టమర్ పొరపాటుగా ఇంత టిప్ ఇచ్చాడని భావించిన బార్ యజమాని అతడికి ఫోన్ చేసి అడిగాడు. ఐతే కావాలనే అంత టిప్ ఇచ్చానని అతను సమాధానం చెప్పడంతో బార్ యజమాని సైతం అవాక్కయ్యాడు. ఇక ఆ టిప్ డబ్బులను బార్‌లో పని చేస్తున్న సిబ్బంది అందరికీ సమానంగా పంచి పెట్టాడు యాజమాని.