కుండపోతగా కురుస్తున్న వర్షాలకు తెలుగురాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. నాలుగు రోజుల నుండి పడుతున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరింది. ఇప్పటికే లోతట్టు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాజెక్టుల వద్దకు వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తివేస్తున్నారు.
కుండపోతగా కురుస్తున్న వర్షాలకు తెలుగురాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. నాలుగు రోజుల నుండి పడుతున్న వర్షాలకు రోడ్లపై మోకాళ్లలోతు నీరు చేరింది. ఇప్పటికే లోతట్టు పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాజెక్టుల వద్దకు వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తివేస్తున్నారు. వరద పొటెత్తుతున్న కారణంగా ఆ ప్రాజెక్టుల వద్ద పరిస్థితి ఆందోళగా మారింది. జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. ఇదే సమయంలో ఇరు రాష్ట్రాల్లో కుండపోతగా వర్షాలు కురస్తూనే ఉన్నాయి. వానలు ఎప్పుడు తగ్గుతాయిరా బాబు అనుకుంటున్న సమయంలో భారత వాతావారణ విభాగం పిడుగులాంటి వార్తను తెలిపింది. మరో అల్పపీడనం పొంచి ఉందని హెచ్చరిస్తోంది. దీంతో మరో నాలుగు, ఐదు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.
ఈ నెల 24న మరో అల్ప పీడనం పొంచి ఉందని ఐఎండీ పేర్కొంది. రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పడనున్నట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు హై అలర్డ్ ప్రకటించింది. తెలంగాణలో 13 జిల్లాలకు అరెంజ్ అలర్ట్, 10 జిల్లాలకు ఎల్లో అలెర్ట్..మిగిలిన జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్‌లలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తుంది.