లావణ్య త్రిపాఠి.. డెహ్రాడూన్ నుండి వచ్చి..,టాలీవుడ్ లో మెరిసిపోతున్న అరుదైన అందం. చేసిన తక్కువ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ఎలాగో స్టార్ ట్యాగ్ వచ్చేయడంతో.. కెరీర్ పరంగా ఆచితూచి సెలక్టీవ్ గా ముందుకి పోతోంది లావణ్య. అయితే.., తాజాగా ఈ అమ్మడికి ఓ వింత ఫోబియా అటాక్ అయినట్టు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ లావణ్య త్రిపాఠిని తిప్పలు పెడుతున్న సమస్య ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడున్న బిజీ కాలంలలోకంలో బాడీని ఫిట్ గా ఉంచుకోవడమే కాదు, మెంటల్ గా కూడా స్ట్రాంగ్ ఉండాలి. అయితే.., చాలా మంది స్టార్స్ ఫిజిక్ పై పెట్టిన శ్రద్ద, మానసిక ప్రశాంతత సాదించడంలో చూపించడం లేదు. గతంలో ఈ కారణంగానే.. వింత వింత ఫోబియాలకి గురయ్యి.. దీపికా పదుకునే అంతటి స్టార్ హీరోయిన్ నరకం అనుభవించింది. కాగా., ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ఈ లిస్ట్ లోకి వచ్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇక తనకున్న ఫోబియాని లావణ్య త్రిపాఠీనే స్వయంగా బయట పెట్టుకోవడం విశేషం. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్ సెషన్లో పాల్గొన్న లావణ్య త్రిపాఠి అభిమానులతో ముచ్చటిస్తూ..ఈ విషయాన్ని బయట పెట్టింది
“నాకు మాములుగా దైర్యం ఎక్కువ. కానీ.., ఈ మధ్య కాలంలో కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే నాలో భయం పుడుతోంది. దీనిని ట్రిపోఫోబియా అంటారట. ఈ సమస్య నుండి బయట పడటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. మరి.., ఈ వింత సమస్య నుండి లావణ్య త్వరగా కోలుకోవాలని మనము కోరుకుందాము.