వెండి తెరపై వెలిసిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసిలో ‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న..ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు’అంటూ క్యూట్ ఎక్స్ ప్రెషన్తో తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది
మోడలింగ్‌లో మెరిసి, అందాల పోటీలో గెలిచి, సీరియల్స్ చేసి ఆ తర్వాత వెండి తెరపై వెలిసిన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసిలో ‘నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న..ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు’అంటూ క్యూట్ ఎక్స్ ప్రెషన్తో తొలి సినిమాతోనే కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. టాలీవుడ్‌కు మరో స్టార్ హీరోయిన్ దొరికిందీ అనుకున్నారంతా. ఆ తర్వాత దూసుకెళ్తా, మనం (క్యామియో), భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి సినిమాలతో స్టార్ అయిపోయింది. మెగా, అల్లు హీరోలతో నటించడం మొదలు పెట్టింది. ఇక అక్కడి నుండి వెను దిరగకుండా సినిమాలు చేస్తూనే ఉంది. ఇటీవల ఓటీటీ ఫ్లాట్ ఫాంలో కూడా ఓ సిరీస్‌తో మెప్పించింది ఈ సొట్ట బుగ్గల సుందరి.
అయితే రూమర్డ్ బాయ్ ఫ్రెండ్, మెగా వారసుడు వరుణ్ తేజ్‌తో పెళ్లి ఫిక్స్ చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. మిస్టర్ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. గత నెలలో పెద్దల సమక్షంలో వీరిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్న సంగతి విదితమే. త్వరలో వీళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ప్రస్తుతం లావణ్య తమిళంలో ఓ సినిమా చేస్తుంది. అలాగే ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నట్లు వినికిడి. అటు వరుణ్ తేజ్ గాంఢీవదారి అర్జున సినిమా షూటింగ్ జరుగుతుంది. అయితే షూటింగ్ సమయాల్లో కాస్త టైమ్ దొరికితే చాలు.. ఈ లవ్ బర్డ్స్ విదేశాల్లో విహరిస్తున్నారు. ఎంగేజ్ మెంట్ అయిపోయిన వెంటనే కూడా వీరు విదేశాల్లో విహరిస్తూ దిగిన ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు కూడా ఈ జంట విదేశాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో దిగిన ఫోటోను షేర్ చేసింది లావణ్య. ఫారిన్ వీధుల్లో అంతా వైట్ అవుట్ ఫిట్‌లో మెస్మరైజ్ చేస్తోంది. రెండు ఫోటోలను పోస్టు చేస్తూ ఓ కామెంట్ పెట్టింది. అందులో గార్జియస్ లుక్స్ తో కనిపిస్తుంది. అయితే ఈ ఫోటో ఎవరు తీశారో కూడా చెప్పింది. విటికె (VTK)తీసినట్లు పేర్కొంది. వరుణ్ తేజ్ కొణిదెల తీశాడని చెప్పేసింది. అలాగే ఓ ప్రేమ్ లో మనిషి నడుకుంటూ వెళ్తుండగా.. రెండో ఫోటోలో కనిపించడు. దీన్నే తెలియ చేస్తూ.. క్యాప్షన్ రాసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.