ప్రస్తుతం వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్‌మెంట్ రింగ్ ధరపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రింగ్ ధర తెలిసి నెటిజన్లు షాక్‌కు గురవుతూ ఉన్నారు.
ప్రముఖ హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల ఎంగేజ్‌మెంట్ ఈ నెల 10వ తేదీన ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగింది. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఈ వేడుకకు హాజరయ్యారు. కాబోయే భార్యాభర్తల్ని ఆశీర్వదించారు. వీరి ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, ఆసక్తికర విషయాలు గత కొన్ని రోజులనుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా వరుణ్ తేజ్ పెట్టిన ఓ పోస్టు బాగా హల్‌చల్ చేసింది. ఇప్పుడు ఈ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంగేజ్‌మెంట్ రింగ్ ధర విషయంలో నెటిజన్ల మధ్య పెద్ద చర్చ జరుగుతోంది.
ఆ రింగ్ ధర తెలిసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. వాళ్లే కాదు.. రింగ్ రేటు తెలిసిన తర్వాత మీరు కూడా నోరెళ్ల బెడతారు. ఆ రేటుతో పేద, మధ్య తరగతి జీవితాలు సెటిల్ అయిపోవచ్చు. ఇంతకీ ఆ రింగ్ ధర ఎంతంటే.. అక్షరాలా 25 లక్షల రూపాయలట. తాను ఎంతగానో ప్రేమించిన లావణ్య కోసం వరుణ్ ఏకంగా 25 లక్షలు పెట్టి ఈ రింగ్ కొన్నాడట. కేవలం రింగు కోసమే ఇంత ఖర్చు పెడితే.. పెళ్లిలో లావణ్య వేసుకోబోయే నగల కోసం ఇంకెంత ఖర్చు పెడతాడోనని ఇటు అభిమానులతో పాటు అటు సగటు నెటిజన్ ఆలోచనల్లో మునిగిపోయారు.
కాగా, ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ‘మిస్టర్’ సినిమా సమయంలో వరుణ్ తేజ్, లావణ్యల మధ్య ప్రేమ చిగురించిందని తెలుస్తోంది. గత కొన్నేళ్లనుంచి ప్రేమించుకుంటున్న వీరు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇక, వీరి ప్రేమ, పెళ్లిపై గతంలో చాలా సార్లు పుకార్లు షికార్లు చేశాయి. ఆ వార్తలే ఇప్పుడు నిజం అయ్యాయి. అతి త్వరలో వీరి వివాహ వేడుక అత్యంత ఘనంగా జరగనుందని సమాచారం. మరి, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల ఎంగేజ్‌మెంట్ రింగ్ ధరపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.