చెన్నై- తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూతురు ఐశ్వర్య, హీరో ధనుష్ జంట విడిపోయింది. అవును వీళ్లిద్దరు తన వివాహ బంధానికి స్వస్తి పలికారు. ధనుష్, ఐశ్వర్యలు విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వార అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరి విడాకులు దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది.
సోషల్ మీడియాలో ధనుష్ ఎంచెప్పారంటే.. స్నేహితులుగా, భార్యాభర్తలు, శ్రేయోభిలాషులుగా 18 సంవత్సరాలుగా కలిసి ప్రయాణించాం.. ఇప్పుడు మా దారులు వేరయ్యాయి.. వాటిలో ప్రయాణించడానికి సిద్ధమయ్యాం.. నేను, ఐశ్వర్య విడిపోవాలని నిర్ణయించుకున్నాం.. మా వ్యక్తిగత సమయాన్ని వెచ్చించాలని నిర్ణయించుకున్నాం.. మా నిర్ణయాన్ని గౌరవించండి.. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి గోప్యత అవసరం.. దాన్ని మాకు కల్పించండి.. అని ధనుష్ లేఖలో చెప్పుకొచ్చాడు.
ఐశ్వర్యా రజినీకాంత్ కూడా ధనుష్, తాను విడిపోతతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఐశ్వర్య.. రజినీకాంత్ పెద్ద కూతురు. 2004 నవంబర్ 18న ధనుష్, ఐశ్వర్య పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర, లింగ ఇద్దరు కుమారులున్నారు. ఐశ్వర్య దర్శకురాలిగా, సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంతో కొనసాగుతోంది. 3, వయ్ రాజా వయ్ సినిమాలకు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. యుగానికొక్కడు సినిమా తమిళ వెర్షన్ ఆయరత్తిల్ ఒరువన్‌కు ఈమె డబ్బింగ్ చెప్పారు.
మొన్న వచ్చిన విజయ్ సినిమా విజిల్ లో ఓ పాటను ఆలపించారు ఐశ్వర్య. ఇక ధనుష్ తమిళంతో పాటు తెలుగు, హిందీ ప్రేక్షకులకు సుపరిచితుడే. ప్రస్తుతం ధనుషు తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో సినిమా రూపొందుతున్నాయి. ఇటువంటి సమయంలో ధనుష్, ఐశ్వర్య విడిపోవడం సినీ పరిశ్రమలో ఆసక్తికరంగా మారింది.