స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 990 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 10 రూపాయలు తగ్గింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 45,980.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,990.
1కిలో వెండి 73, 200
బిజినెస్ డెస్క్- ఈ రోజు సోమవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 99 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 1 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 990 రూపాయలు పెరిగి 45 వేల 980 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 10 రూపాయలు తగ్గి 48 వేల 990 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధరలో మార్పు లేదు. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 73 వేల 200 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 1230 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 170 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 400 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,530 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,180 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48,180 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,140 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,430 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.