స్వల్పంగా తగ్గిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 300 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 330 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,100.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,110.
1కిలో వెండి 69,100
బిజినెస్ డెస్క్- ఈ రోజు బుధవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 30 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 33 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 300 రూపాయలు తగ్గి 44 వేల 100 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 330 రూపాయలు తగ్గి 48 వేల 110 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 500 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 69 వేల 100 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 350 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 380 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 520 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,570 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,120 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,120 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,250 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,450 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.