సాధారణంగా భార్యభర్తలు కుటుంబ కలహాల కారణంగా విడాకులు తీసుకుంటారు. ఇది ఎక్కడైన జరిగే సర్వ సాధారణమైన విషయం. అయితే కొన్ని చోట్ల మాత్రం కప్పలు కూడా విడాకులు తీసుకుంటున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కప్పలకు పెళ్లి చేస్తారు అని చాలా మందికి తెలుసు. కానీ కప్పలు విడాకులు తీసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే కప్పల విడాకులు తీసుకోవడం వెనుక కూడా బలమైన కారణం ఒకటి ఉంది. మరి.. ఆ కారణం ఏమిటి? ఆ జంట కప్పల విడాకుల వివరాలేంటో ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో అనేక ఆచారాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రకృతి పట్ల బలమైన నమ్మకం ఉంటుంది. అక్కడ వర్షాలు పడటం ఆలస్యం అయితే ఆడ, మగ రెండు కప్పలను పట్టుకుని స్థానిక సంప్రదాయం ప్రకారం పెళ్లి చేస్తారు. ఊరంతా వాటిని ఊరేగిస్తారు. ఊరంత భోజనాలు కూడా పెడతారు. ఆ తరువాత వాటిని దగ్గర్లోని చెరువులల్లో విడిచి పెడతారు. ఇలా చేయడం ద్వారా వరుణ దేవుడు కరుణించి.. వర్షాలు కురుస్తాయని ప్రజలు నమ్ముతారు. వర్షాలు కూడా సకాలం పడతుంటాయి. చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతుంటాయి.
అయితే వర్షాలు అవసరానికి మించి దంచి కొడితే.. పంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది. దీంతో కప్పలకు పెళ్లి చేసిన ప్రజలే వాటికి విడాకులు ఇస్తారు. ఎడతెరిపి లేకుండా కురిసే సమయంలో ప్రజలు తీవ్రంగా నష్ట పోతుంటారు. వరదులు ఇళ్లపై, పంటపోలపైకి వచ్చి తీవ్ర నష్టాన్ని మిగులుస్తుంటాయి. ఈ క్రమంలో కప్పలకు పెళ్లి చేస్తే.. వానలు పడతాయి అని ఎలా నమ్ముతారో, కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు కప్పలకు విడాకులు ఇస్తే వానలు ఆగిపోతాయి అని నమ్ముతారు.ముఖ్యంగా భోపాల్ పరిసర ప్రాంతాల్లో ఈ కప్పల విడాకుల పద్ధతి భలే వింతగా ఉంటుంది.
స్థానిక సంప్రదాయాల ప్రకారం వాటికి విడాకులు ఇస్తారు.రెండు కప్పలను పట్టుకుని వాటిలో ఆడకప్పకు ఓ రంగు దుస్తులు..మగ కప్పకు వేరే రకం దుస్తులు వేస్తారు. తరువాత ఆడ కప్పకు పసుపు కుంకుమ పెడతారు. కాసేపటికి వాటిని వేరు వేరు చెరువుల్లో వేస్తారు. అంటే పెళ్లి చేసినప్పుడు ఒకే చెరువులో వదిలిస్తే..విడాకులు తరువాత వేరు వేరు చెరువుల్లో వదులుతారు. దాంతో వర్షాలు తగ్గుతాయని వారి నమ్మకం.. మరి.. ఈ వింత నమ్మకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Personal Loan: గంటలోపే పర్సనల్ లోన్.. ఎలా అప్లై చేయాలంటే?
ఇదీ చదవండి: ఈమె అందం చుట్టూ ఊహించని రచ్చ! ఆ వీడియోస్ బయటకి!
ఇదీ చదవండి: Video: మహిళకు రెప్పపాటులో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్