ఇటీవల భారీ వర్షాలతో బీభత్సం సృష్టించిన వరుణుడు మరోసారి తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్దమవుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి.
ఇటీవల భారీ వర్షాలతో బీభత్సం సృష్టించిన వరుణుడు మరోసారి తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్దమవుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి. రాగల రెండు రోజుల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. గత పదిహేను రోజుల నుంచి ముఖం చాటేసిన వరుణుడు మళ్లీ భారీ వర్షాలతో విరుచుకుపడనున్నాడు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు అల్లకల్లోలం సృష్టించాయి. భారీ వరదలతో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఎన్నో గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకోగా రాకపోకలు కూడా స్తంబించిపోయాయి.
రానున్న రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే భారీ వర్షాలు, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దీంతో అధికార యంత్రాంగం వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటోంది.