మళ్లీ వానల జోరు కొనసాగనున్నది. అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఇటీవల భారీ వర్షాలతో బీభత్సం సృష్టించిన వరుణుడు మరోసారి తన ప్రతాపాన్ని చూపించేందుకు సిద్దమవుతున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మళ్లీ వర్షాలు దంచికొట్టనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిలాలకు మళ్ళీ వాన గండం పొంచివుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇటీవల ఏపీలో నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు సృష్టించిన బీభత్సం అంతఇంతకాదు. దాని నుంచి ఇంకా తేరుకోక ముందే ఏపీకి మరో తుఫాన్ గండం వచ్చింది. “బుధవారం మధ్య అండమాన్ సముద్రం.. దాని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించింది. ఇది ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మధ్య ప్రాంతంలో […]
తగిలిన గాయం మీదనే మళ్లీ గాయంమైనట్లు ఉంది నెల్లూరు, చిత్తూరు జిల్లా వాసుల పరిస్థితి. ఇప్పటికీ కురిసిన భారీ వర్షాల దెబ్బ నుంచి ఇంక బయటపడ లేదు. ఇంతలోనే మరో పిడుగు లాంటి వార్త. ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మరొసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతారవరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో నేటి నుంచి ఈ నెల30 వరకు భారీ వర్షాలు […]