హైహైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారే మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షాలు పడటంతో పలు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ జామ్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గత పదహేను రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు లోతట్లు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయ్యాయి. కొన్ని గ్రామాలు పూర్తిగా నీట మునిగి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రాగల రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇదిలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో మళ్లీ కారుమబ్బులు కమ్ముకున్నాయి. ఆదివారం సాయంత్రం ఓ మోస్తారులో వర్షం పడింది.
హైదరాబాద్ లో గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. నిన్న కాస్త తెరిపించినా.. ఆదివారం సాయంత్రం మళ్లీ కొన్నిప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో సాయంత్రం మళ్లీ వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాలు పడుతున్నాయి. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ లో భారీగా వర్షం పడుతుంది. ఇక లింగంపల్లి, అశోక్ నగర్, మియాపూర్, బషీర్ బాగ్, కోఠి, సికింద్రాబాద్, అబిడ్స్, బేగంబజార్, సుల్తాన్ బజార్, అఫ్జల్ గంజ్, ఉప్పల్, బైరతాబాద్, లక్డీకాపూల్, దిల్ సుఖ్ నగర్, ఎల్ బీనగర్, హైయత్ నగర్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతుంది.
భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్లు కరెంట్ స్తంబాలు పడిపోవడంతో అటువైపు వెళ్లవద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలు పడుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పనులు ఉంటే మాత్రమే బయటకు రావాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరిస్తున్నారు. భారీ వర్షాలు కారణంగా అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలకు రంగంలోకి దిగారు.