స్పెషల్ డెస్క్- పెళ్లి సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి అంటేనే బంధువులు, స్నేహితులు, సందడి, సరదా.. అబ్బో ఒక్కటేమిటి ఆ హంగామానే వేరు. ఇక పెళ్లిళ్లలో కొత్త పెళ్లి కూతురు, పెళ్లి కొడుకును వారి వారి స్నేహితులు ఆటపట్టించడం సర్వ సాధారణం. ఈ మధ్య కాలంలో వివాహ వేడుకకు సంబందించిన సంఘటనలన్నీ సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయు. పళ్లి వేడుకల్లో జరిగే సరదా ఘటనలు బాగా వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ వివాహ వేడుకలో జరిగిన సరదా సన్నివేశానికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది. ఓ జంటకు పెళ్ళి అయ్యాక, వధూ వరులు రిసెప్షన్‌లో కూర్చున్నారు. బంధువలంతా వారిని కలిసి ఫోటోల దిగుతున్నారు. ఈ క్రమంలో వధూవురులను ఏడిపిస్తూ స్నేహితులు సరదాగా చేసిన ఈ ప్రాంక్ వీడియో భలే సరదాగా ఉంది.
పెళ్లి రిసెప్షన్ వేడుకలో పెళ్లి కూతురు పక్కన కూర్చున్న పెళ్లి కొడుకు దగ్గరకు అతని స్నేహితులు ఒక్కొక్కరూ వచ్చి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇద కూడా వరుడి చేతిలో చిల్లర డబ్బులు వేసి అతని కాళ్లకు దండాలు పెట్టారు. వరుడు కూడా అందుకు అనుగునంగానే వారిని ఆశీర్వదించాడు. కొంత మంది పెళ్లి కూతురు కాళ్లకు కూడా దండం పెట్టి ఆశిర్వాదం తీసుకున్నారు. వధువు నవ్వూతూ కూర్చుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.