మార్కెట్ లో నుండి పిల్లలు తినేందుకు తినుబండారాలు తెస్తున్నారా. అవి మంచివేనా. ఆ వాటిపై ఉన్న ఎక్స్ పెయిరీ డేట్ చూసే తెచ్చామని భావిస్తున్నారా. అయితే ఈ కథనాన్ని చదవండి. ఎందుకంటే రీ సైక్లింగ్ చేస్తూ ఓ ముఠా పట్టుబడింది. ఇంతకు ఈ రీ సైక్లింగ్ అంటే ఏమిటంటే?
ఈ రోజుల్లో తినే వస్తువులు ఏదీ కల్తీనో, ఏదీ ఒరిజనలో తెలుసుకోవడం కష్టంగా మారింది. కల్తీ, కాలం చెల్లిన వస్తువులను మార్కెట్ లో అమ్ముతున్నారు కొందరు మాయగాళ్లు. వీటిని అమాయక ప్రజలకు అమ్మి నిలువెల్లా మోసం చేస్తున్నారు. అసలు గుర్తు పట్టలేని విధంగా ఏ మాత్రం అనుమానం రాకుండా ప్రజలను ఏమారుస్తున్నారు. ఆహార ఉత్పత్తులకు ఎక్స్ పెయిరీ డేట్ కచ్చితం. అది ఉంటేనే ఉత్పత్తికి విలువ. మార్కెట్ లోనూ అమ్ముడయ్యేది కూడానూ. తేడా వస్తే ఫుడ్ పాయిజన్ అవుతుంది. అలాంటి ఉత్పత్తులు రీ సైక్లింగ్ చేస్తూ దొరికిపోయిందీ ఓ ముఠా. పోలీసులు వీరి గుట్టును రట్టు చేశారు.
హైదరాబాద్‌లోని బోడుప్పల్ రీసైక్లింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రీ సైక్లింగ్ అంటే కొత్త సీసాలో పాత సరుకు లెక్క. అంటే కాలం చెల్లిన ఉత్పత్తులకు తేదీలను కొత్త లేబుల్ వేసి.. వాటినే కొత్త ఉత్పత్తులుగా మార్కెట్‌లోకి వదులుతున్నారు. సబ్బులు, షాంపులు, తినుబండారాలు అనేకం ఉన్నాయి. ఇందులో పిల్లలు తినే బిస్కెట్లు, చాకెట్లు, లాలీ పాప్స్, చిప్స్ వంటి ఉత్పత్తులు కొకొల్లలు. హైదరాబాద్ శివార్లలోని బోడుప్పల్, కోఠిలోని అరిహంత్ కార్పొరేషన్ కార్యాలయం గోదాముల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. కోట్ల విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 300 రకాల వస్తువులను ముఠా రీ సైక్లింగ్ చేసినట్లు గుర్తించారు.
పోలీసులు తెలుపుతున్న కథనం ప్రకారం.. మార్కెట్ లో కాలం చెల్లిన వస్తువులను తీసుకు వచ్చి.. స్టిక్కరింగ్ చేస్తున్నారని, వాటిని మార్కెట్ లోకి అమ్ముతున్నారని చెప్పారు. రెండు మూడేళ్ల క్రితం నాటి ఉత్పత్తులను వీరు రీ సైక్లింగ్ చేస్తున్నారని తెలిపారు. వాటిలో చిన్న పిల్లలు తినే తినుబండారాలు, ఫెర్మూమ్స్, శానిటైజర్ వంటి వస్తువులన్నాయని చెప్పారు. 2020 నాటి వస్తువులు కూడా ఉన్నాయన్నారు. పాత ఉత్పత్తులకు డేట్లు మార్చి అమ్ముతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో వివిధ కంపెనీల్లో తయారు అయి, కాలం చెల్లిన లేదా చెల్లిపోతున్న ప్రొడక్ట్స్‌ను స్రాప్ కింద కొనుగోలు చేస్తున్న ఈ ముఠా.. వాటిని గోదాములకు తీసుకు వచ్చి.. పాత స్టికర్లు తొలగించి.. వాటికి కొత్త స్టికర్ వేస్తున్నారని తెలిపారు.
2024-25 వరకు ఎక్స్ పెయిరీ తేదీలను వేస్తున్నారు. మొత్తంగా ఈ వ్యవహారంలో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేశారు. అంబలా జైన్, కమల్ జైన్ కోఠి కేంద్రంగా వ్యవహరిస్తున్నారని తేలింది. హైదరాబాద్ మొత్తంగా ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న ముఠాలను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి లోతుగా విచారణ జరుపుతామని అన్నారు. కల్తీ, నకిలీలతో పాటు ఇప్పడు ఈ మోసం బయట పడటంతో ఏదీ తినాలో, తినకూడదో, ఏ వస్తువు మంచి, కాదో తెలుసుకోవడం కష్టమే అవుతుంది. వినియోగదారులారా సో బీ కేర్ ఫుల్. ఈ రీసైక్లింగ్ రూపంలో పాత ఉత్పత్తులను కొత్తగా మార్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.