హీరోయిన్స్ ను గ్లామర్ డాల్స్ గా అభివర్ణిస్తుంటారు. అయితే.. తాము కేవలం గ్లామర్ మాత్రమే కాదు.. యాక్షన్ లోనూ చెలరేగిపోతామంటున్నారు ఇప్పటి హీరోయిన్స్. హీరోలకు దీటుగా స్టంట్స్ లో రాణించడానికి భారీ స్థాయిలో కసరత్తులు కూడా చేస్తున్నారు. మరి ఆ నారీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పుకోవాల్సింది అక్కినేని కోడలు సమంత గురించి.
ఒకవైపు పర్సనల్ లైఫ్ ని.. మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్ ని చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ వరుస విజయాలు అందుకుంటుంది సమంత. సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా పీక్స్ చూసిన సామ్.. ఇప్పుడు వెబ్ దునియాలోనూ మంచి పాపులారిటీ దక్కించుకుంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’లో తన పెర్ఫామెన్స్ తో డిజిటల్ ఆడియన్స్ లో సెపరేట్ క్రేజ్ సంపాదించుకుంది సామ్. ఇక.. ఆన్ స్క్రీన్ పై ఇప్పటివరకూ సాప్ట్ రోల్స్ లో రాణించిన సమంత.. ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ కోసం స్టంట్స్ లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంది. ఈ సిరీస్ లోని సామ్ చేసిన స్టంట్స్ కు విపరీతమైన అప్లాజ్ వచ్చింది.
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇక.. ఈ చిత్రంలోని శ్రుతి పాత్రను వైవిధ్యంగా తీర్చిదిద్దాడట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రోల్ లో కనిపించనుందట శ్రుతి హాసన్. కథలో భాగంగా శ్రుతి కొన్ని సన్నివేశాలలో స్టంట్స్ కూడా చేయనుందట. అందుకే.. మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకుంటోందట ఈ స్టార్ డాటర్.
బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటుంది కంగన రనౌత్. ‘మణికర్ణిక’లో కత్తి యుద్ధాలతో మురిపించిన కంగన.. అప్ కమింగ్ మూవీ ‘ధాకడ్’ కోసం గన్ పట్టుకుని యాక్షన్ లో చెలరేగిపోనుంది. ‘ధాకడ్’ కోసం స్టంట్స్ లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకుందట కంగన రనౌత్. ఇక.. హాలీవుడ్ మూవీ ‘కిల్ బిల్’ రీమేక్ లో బాలీవుడ్ స్టార్ కృతి సనన్ నటించనుందట. ఈ యాక్షన్ థ్రిల్లర్ కోసం కృతి కూడా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునే పనిలో ఉందట కృతి. వీరే కాక.. మరింత మంది స్టార్ హీరోయిన్స్ హీరోలతో సమానంగా యాక్షన్ సీక్వెన్స్ లతో దుమ్ము రేపుతుండటం విశేషం.