ఫిల్మ్ డెస్క్- రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. బర్త్ డే సందర్బంగా అపోలో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావడంతో మెగా ఇంట్లో సంబరం నెలకొంది. ఐతే సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక, ఆయన ఫోటో మాత్రం ఇంత వరకు బయటకు రాలేదు. సోషల్ మీడియాలో థమ్సప్ సింబల్ పెట్టి తాను బాగున్నానని మాత్రం చెప్పాడు సాయి ధరమ్ తేజ్.
అంతే కాదు ఎప్పటికప్పుడు సాయి ధరమ్ తేజ్ హెల్త్ అగురించి అప్డెట్ చెబుతూ మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు అభిమానులకు టచ్ లో ఉన్నారు. సాయి ధరమ్ తేజ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని, ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడని, దసరా పండగ రోజే తను ఇలా మా ఇంటికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి ట్వీట్ చేశారు.
ఇక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సాయి ధరమ్ తేజ్ ను దర్శకుడు హరీష్ శంకర్ కలిశాడు. ఈమేరకు హరీష్ శంకర్ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఐతే సాయి ధరమ్ తేజ్ ఫోటో మాత్రం పోస్ట్ చేయలేదు. కానీ తాను, సాయి ధరమ్ తేజ్ చేసి పట్టుకున్న పిక్ ను పోస్ట్ చేశాడు హరీష్ శంకర్. అంతే కాదు సాయి ధరమ్ తేజ్‌ను కలిసి ఎన్నో ముచ్చట్లు పెట్టానని, త్వరలోనే రాబోతోన్నాడు.. కుమ్మేస్తాడు.. అంటూ చెప్పుకొచ్చాడు.
సాయి ధరమ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందుకే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక ప్రత్యేకంగా సాయి ధరమ్ తేజ్ ఇంటికి వెళ్లి మరీ పలకరించి, కాసేపు కబర్లు చెప్పి వచ్చాడు హరీష్ శంకర్. అదన్నమాట సంగతి.