పశ్చిమగోధావరి- అత్తా.. కోడళ్లు అంటే బద్ద శత్రువులు. అత్తకు కోడలికి అస్సలు పడదు. ఇద్దరు ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉంటారు. ఇక సినిమాలు, టీవీ సీరియల్స్‌లో చూపించే అత్తా కోడళ్ల వార్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అత్తంటే గయ్యాలిగానే చూపిస్తారు సినిమాల్లో, సీరియల్స్ లో. కానీ నిజ జీవితంలో అలా ఏం ఉండదు. అత్తా కోడళ్లు తల్లీ బిడ్డల్లా కలిసి మెలిసి ఉంటారని చాలా సందర్బాల్లో చూశాం.
నేటి సమాజంలో అందరికీ ఆదర్శంగా నిలిచే అత్తా కోడళ్లు చాలా మంది ఉన్నారు. అత్తను కూడా కన్న తల్లిగా సూచే కోడళ్లు సైతం ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కోడలు అత్తపై ప్రేమను అలాగే కురిపించింది. పుట్టిన రోజు నాడు ఎవరూ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ కోడలు తన అత్తగారి పుట్టిన రోజును ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఇందు కోసం ఏకంగా 60 రకాల వంటకాలను తవండింది. తన అత్త కోసం ప్రత్యేకంగా వండిన వంటకాలను డబ్బాల్లో నింపి వాటిపై పేర్లు రాసి పెట్టింది. ఇడ్లీ నుంచి పెరుగు వరకు, పులి హోర నుంచి నూడిల్స్ వరకు.. ఒక్కటేమిటి అన్నీ వెరైటీలు కలిపి 60 రకాలు ఉన్నాయి. అత్తగారిపై కోడలు చూపించిన ప్రేమను చూసి అంతా ఔరా అంటున్నారు.
తన అత్తకు 60 ఏళ్లు కావడంతో ఆ కోడలు 60 రకాల వెరైటీ వంటలను చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. కోడలి ప్రేమకు అత్త సైతం ఉబ్బి తబ్బిబ్బైంది. ఈ వంటకాల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అత్తా కోడళ్ళ అనుబంధం చూసి నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.