రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తోన్నాయి. గరిష్టంగా 49 డిగ్రీలను దాటాయి అంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే నిత్యం అక్కడకక్కడ అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిని తలపిస్తోన్నాయి. గరిష్టంగా 49 డిగ్రీలను దాటాయి అంటే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. రాత్రి 7 నుంచి 8 గంటల సమయంలో కూడా వేడిగాలులు వీస్తున్నాయి. పెరుగుతున్న ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇది ఇలా ఉంటే రోడ్ల మీద ప్రయాణిస్తున్న వాహనాల టైర్లు పెళ్లిపోతున్నాయి. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ లతో సెల్ ఫోన్ టవర్లు కాలిపోతున్నాయి. తాజాగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొత్త పట్టి సీమలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. వందల ఎకరాల్లో వరి కుప్పలు దగ్ధమయ్యాయి. భారీ ఎండల ధాటికి మంటలు రాజుకున్నాయి. దీంతో వంద ఎకారాల్లో ఉన్న వరి కుప్పలకు మంటలు అంటుకున్నాయి. తొలుత ఒక వరికుప్పకు అంటుకున్న నిప్పు.. క్షణాల్లో మిగిలిన వరి కుప్పలకు అంటుకున్నాయి. చూస్తుండగానే క్షణాల్లో వంద ఎకరాల పంటపొలంలోని వరి కుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆపే ప్రయత్నం చేసతున్నారు. వరి కోతలు కోసి కుప్పలుగా పెట్టారు. ఇలా కుప్పలకు గా ఉన్న వరి.. మంటలకు దగ్ధమయ్యాయి. వరి కుప్పలు కాలిపోవడంతో తమకు తీవ్ర నష్టం జరిగిందిని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా నిత్యం పెరుగుతున్న ఎండ తీవ్రత ధాటికి ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.