అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా అని సినీ కవి రాసినట్లు.. ఎంత చేసినా అమ్మ రుణాన్ని తీర్చుకోలేము. పురిటి నొప్పుల్ని పంటి బిగువన దాచి మరో ప్రాణానికి కారణజన్మురాలు అవుతుంది తల్లి.
అమ్మను మించి దైవమున్నదా ఆత్మను మించి అర్థమున్నదా అని సినీ కవి రాసినట్లు.. ఎంత చేసినా అమ్మ రుణాన్ని తీర్చుకోలేము. పురిటి నొప్పుల్ని పంటి బిగువన దాచి మరో ప్రాణానికి కారణజన్మురాలు అవుతుంది తల్లి. తాను పస్తులుండీ పిల్లల కడుపు నింపుతుంది. వారి ఉన్నతికి అహర్నిశలు పాటు పడుతుంది. నిద్రాహారాలు మానేసి బాగోగులు చేపడుతుంది. తండ్రి డబ్బు తీసుకువచ్చి చేతిలో పెడితే.. కుటుంబ బాధ్యతలు నెత్తిన వేసుకుని జీతం తీసుకోకుండా పని చేసే ఏకైక జీవి అమ్మ. అటువంటి అమ్మ పట్ల కొంత మంది పిల్లలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. తల్లి పట్ల ఆప్యాయితగా మెలగాల్సిన కడుపున పుట్టిన బిడ్డలు క్రూర మృగాలుగా వ్యవహరిస్తూ అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు.
రెండేళ్ల క్రితం హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బల్కంపేట్‌లో చోటుచేసుకున్న కేసులో కసాయి కుమారుడికి కఠిన శిక్ష పడింది. మత్తు పదార్ధాలకు బానిసై.. తల్లిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు ఓ కుమారుడు. వివరాల్లోకి వెళితే.. సంగీతకు సంతోష్ అనే కుమారుడు ఉన్నారు. అయితే అతడు గంజాయికి అలవాడు పడ్డాడు. ఆ మత్తులో ఇంటికి వచ్చి తల్లితో గొడవపడ్డాడు. ఆ సమయంలో కత్తితో విచక్షణారహితంగా కడుపులో పొడిచాడు. అంతేకాకుండా కడుపులోని పేగులకు బయటకు లాగి క్రూరంగా వ్యహరించాడు. ఆ సంఘటన అప్పట్లో పెను సంచలనం అయ్యింది. ఈ కేసులో తాజాగా కోర్టు కసాయి కొడుకుని దోషిగా తేల్చుతూ.. యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రెండేళ్ల కాలంలోనే దోషికి శిక్షపడేలా కోర్టుకు ఆధారాలు సమర్పించిన ఎస్ఆర్ నగర్ పోలీసుల్ని ఉన్నతాధికారులు అభినందించారు.