నూటికి 90 పెళ్లిళ్లు ఇష్టం లేకుండానే జరిగి.. కాంప్రమైజ్ అనే సిద్ధాంతంపై నడుస్తున్నాయి. పెద్దలు బలవంత పెట్టారని, ఇంకేదో కారణాలతో ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని గుట్టుగా సంసారాన్ని నెట్టుకు వచ్చేవాళ్లు కొందరైతే..
నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కంటే.. పెళ్లి చేసుకోకుండా ఉండటమే మేలు. నూటికి 90 పెళ్లిళ్లు ఇష్టం లేకుండానే జరిగి.. కాంప్రమైజ్ అనే సిద్ధాంతంపై నడుస్తున్నాయి. పెద్దలు బలవంత పెట్టారని, ఇంకేదో కారణాలతో ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని గుట్టుగా సంసారాన్ని నెట్టుకు వచ్చేవాళ్లు కొందరైతే.. కాపురమనే ఇరుసు చట్రంలో ఇమడ లేక ఇబ్బందులకు గురి అవుతున్నారు మరి కొంత మంది. చివరకు కట్టుకున్న వారితో సంసారం చేయలేక గొడవలు పడుతుంటారు. ఈ గొడవల కారణంగా భార్యా భర్తల్లో ఒకరు లేదా ఇద్దరూ ఆత్మహత్యకు ఒడిగట్టడమో, హత్యకు గురి అవుతున్నారు. అటువంటి ఉదంతమే సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని మిరుదొడ్డి మండలానికి చెందిన కనకరాజుకు ఏడాది క్రితం నిజాంపేట మండలం చల్మెగ గ్రామానికి చెందిన భవానితో వివాహం జరిగింది. అయితే వివాహం జరిగిన నాటి నుండే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ప్రేమగా చూసుకోవాల్సిన భార్యతో రోజూ తగాదాలు పెట్టుకుంటున్నాడు. ఈ విషయం పెద్దల దృష్టికి వెళ్లింది. వారు పలుమార్లు నచ్చజెప్పినప్పటికీ తగాదాలు సద్దుమణగలేదు. చివరకు పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టించారు. అయినా సమస్య కొలిక్కి రాలేదు. అయితే భార్యతో కాపురం చేయడం ఇష్టం లేని కనకరాజు..వదిలించుకోవాలని అనుకున్నాడు.
భార్య ఎప్పుడు నిద్ర పోతుందా అని ఎదరు చూశాడు. భవాని నిద్రపోయిన తర్వాత.. ముఖంపై దిండుతో అదిపి చంపేశాడు. ఆ తర్వాత అక్కడ నుండి పరారయ్యాడు. ఉదయాన్నే భవాని ఎంతకూ నిద్ర లేకపోవడంతో చుట్టుప్రక్కల వారు గమనించి.. ఇంట్లోకి వెళ్లి చూడగా.. శవమై కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇష్టం లేని పెళ్లిళ్లు లేదా, పెళ్లి అయ్యాక జీవిత భాగస్వామి నచ్చకపోతే ఇలా దారుణానికి ఒడిగట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.