ఆ ఇద్దరు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. ప్రేమించానని అబ్బాయి అనడంతో అమ్మాయి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు. అందమైన కొడుకు.
ఆ ఇద్దరు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నారు. ప్రేమించానని అబ్బాయి అనడంతో అమ్మాయి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు. అందమైన కొడుకు. కానీ మూడో వ్యక్తి ఎంట్రీ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. మరో మహిళతో భర్త అక్రమ సంబంధం నెరుపుతున్నాడని తెలిసి నిలదీసే సరికి.. భార్యపై దాడి చేయడం మొదలు పెట్టాడు. ఇవన్నీ పుట్టింటికి చెప్పలేక పంటి బిగువున నొప్పి భరించింది. చివరకు మరింత టార్చర్ పెడుతుంటే.. తల్లిదండ్రులకు చెప్పుకుని గొల్లుమంది. దీంతో అతడికి పలుమార్లు కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినప్పటికీ.. అతడిలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. దీంతో భార్య తీవ్ర నిర్ణయం తీసుకుంది.
భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని.. తనను వేధిస్తుండటంతో ఫేస్ బుక్ లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది సన అనే మహిళ. బాధితురాలు తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం.. సన, అల్లుడు హేమంత్ పటియాలా చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు.. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. తాము మొదట పెళ్లికి అంగీకరించకపోతే.. కూతురు సన తమను ఒప్పుకునేలా చేసిందని తెలిపారు. ఆ తర్వాత వీరిద్దరికీ పెళ్లి చేశామని, ఐదేళ్ల క్రితం వీరి వివాహం జరిగినట్లు పేర్కొన్నారు. ఇద్దరూ ఉద్యోగాల నిమిత్తం ఢిల్లీలో కాపురం ఉండేవారని చెప్పారు. అక్కడ ఉండగా.. అల్లుడు హేమంత్.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, తెలిసి అడిగితే.. తన కుమార్తెతో రోజు గొడవ పడేవాడని పేర్కొన్నారు. అత్తింటి వారు కూడా ఆమెను వేధించేవారని చెప్పారు.
చివరకు మాకు తెలిసి.. అడిగితే.. ఆమెను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాడన్నారు. ఢిల్లీ, నాచారంలో పలుమార్లు కౌన్సిలింగ్ ఇప్పించామని తెలిపారు. నాచారం వచ్చాక.. సైప్రస్ వెళ్లేందుకు తన కుమార్తెతో మంచిగా ఉన్నట్లు నటించాడని, అక్కడకు వెళ్లాక ఆమెను మరింత మానసిక వేదనకు గురి చేశాడని చెప్పారు. మమ్మల్ని, అమ్మాయిని, మా కుమారులను ఫోన్ చేసినప్పుడల్లా తిడుతూ ఉండేవాడని వెల్లడించారు. దీంతో తన కుమార్తె మానసిక క్షోభకు గురై.. ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ఫోనులో ఫేస్ బుక్ లైవ్ పెట్టి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సన ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.