శ్రీకాంత్ వరంగల్ నుంచి ఇల్లు వదిలి, తల్లితో కలసి నిజామాబాద్‌కు వెళ్లిపోయాడు. అక్కడే కూలీ పనులు చేసుకుంటున్నాడు. 2019లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరోనా సమయంలో శ్రీకాంత్ అనారోగ్యం బారినపడ్డాడు. దీంతో తన ఇంటి స్థలాన్ని అమ్మి ఆ డబ్బుతో.. ట్రీట్‌మెంట్ తీసుకోవాలని భావించాడు. అయితే
మానవ సంబంధాలు రోజు రోజుకు కుంచించుకుపోతున్నాయి. ముఖ్యంగా డబ్బు బాంధవ్యాల మధ్య ప్రధాన పాత్రను పోషిస్తుంది. తల్లిదండ్రులు, పిల్లలు, అన్నాదమ్ములు-అక్కా చెల్లెల్ల సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ఒకప్పుడు కలిసి మెలిసి ఎంతో అప్యాయతగా ఉన్న అన్నాదమ్ములు.. పెరిగి పెద్దయ్యాక ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారు. ఆర్థిక విషయాలపై కొట్లాడుకుంటున్నారు. అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడటం లేదు. అటువంటిదే ఈ ఘటన. ప్రస్తుతం కుటుంబ బంధాల విషయంలో ఈ ఘటన ప్రశ్నార్థకంగా మారిందనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆస్తి కోసం సొంత తమ్ముడు అని కూడా చూడకుండా అత్యంత దారుణంగా హతమార్చాడో కఠినాత్ముడైన అన్న. ఈ దారుణ ఘటన వరంగల్ పట్టణం కరీమాబాద్ ఉర్సు ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40వ డివిజన్ ఉర్సు తాళ్లమండువకు చెందిన గోవిందుల శ్రీనివాస్, శ్రీధర్, శ్రీకాంత్ ముగ్గురూ అన్నదమ్ములు. తల్లిదండ్రులు ఇచ్చిన ఇంటి స్థలాన్ని ముగ్గురు అన్నదమ్ములు 94.16 గజాల చొప్పున వాటాలు పంచుకున్నారు. అయితే పెద్ద కుమారుడు శ్రీనివాస్ మరణించాడు. అయితే చిన్నవాడైన శ్రీకాంత్‌కు వచ్చిన వాటా విషయంలో అన్న శ్రీకాంత్ గొడవ పడుతున్నాడు. ఇంట్లో వాటా ఇవ్వనని.. ఇక్కడే ఉంటే చంపుతానని అన్న శ్రీధర్ తన తమ్ముడు శ్రీకాంత్‌ను బెదిరించే వాడు.
ఈ క్రమంలో శ్రీకాంత్ వరంగల్ నుంచి ఇల్లు వదిలి, తల్లితో కలసి నిజామాబాద్‌కు వెళ్లిపోయాడు. అక్కడే కూలీ పనులు చేసుకుంటున్నాడు. 2019లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కరోనా సమయంలో శ్రీకాంత్ అనారోగ్యం బారినపడ్డాడు. దీంతో తన ఇంటి స్థలాన్ని అమ్మి ఆ డబ్బుతో.. ట్రీట్‌మెంట్ తీసుకోవాలని భావించాడు. శ్రీకాంత్ తిరిగి వరంగల్‌కు వచ్చేశాడు. ఇంటి స్థలాన్ని విక్రయించటానికి ప్రయత్నిస్తుండగా సోదరుడు శ్రీధర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ బెదిరింపులతో విసిగిపోయిన శ్రీకాంత్ ఈనెల 7న మిల్స్‌కాలనీ పోలీసు స్టేషన్‌లో తన అన్న శ్రీధర్‌పై కంప్లైంట్ చేశాడు. శ్రీధర్‌ను స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు.. అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో తన సోదరుడు భూమి అమ్ముకోవడానికి తనకేమీ అభ్యంతరం లేదని శ్రీధర్ పోలీసుల ముందు ఒప్పుకొన్నాడు.
దీంతో అన్ని అడ్డంకులు తొలిగిపోయాయని భావించిన శ్రీకాంత్.. భార్యతో కలసి వరంగల్‌కు వచ్చి బంధువుల ఇంట్లో ఉంటూ స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నాలు మెుదలు పెట్టాడు. శనివారం ఇద్దరు కొనుగోలుదారులను వెంట తీసుకొని శ్రీకాంత్ తన స్థలం వద్దకు వెళ్లాడు. వెనక నుంచి వచ్చిన శ్రీధర్.. ఈ విషయంపై ఇంట్లోకి వెళ్లి మాట్లాడుకుందాం రమ్మని ప్రేమగా పిలిచాడు. అన్నయ్య మాటలు నమ్మని శ్రీకాంత్.. శ్రీధర్ ఇంటికి వెళ్లాడు. ఆ తర్వాత శ్రీకాంత్‌ను గదిలో బంధించి శ్రీధర్ కర్రతో దాడి చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గడియ పెట్టి.. అతడు బయటకు రాకుండా చేశాడు. మంటల్లో చిక్కుక్కున్న అతడు.. ఎలాగోలా ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తాడు.
అయినా వదిలిపెట్టని శ్రీధర్.. వీధిలో అందరూ చూస్తుండగానే రాయితో కొట్టి హత్యచేశాడు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు శ్రీకాంత్‌ను అన్న శ్రీధర్ ను హింసిస్తున్నా స్థానికులెవ్వరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. అతడిని చంపిన తర్వాత శ్రీధర్, అతని భార్యా, పిల్లలు పరారయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి భార్య రాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఆస్తుల కోసం అన్నదమ్ములు కొట్టుకున్న ఈ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.