ఓ చిన్న పరిచయం.. రెండు సార్లు మాట్లాడి, ఒక చిరు నవ్వు నవ్వితే అది ప్రేమ అనుకుని, చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ.. మోజు తీరాక మోహం చాటేస్తున్నారు. ప్రేమ పేరుతో వంచన చేయడం ఒక ఎత్తు అయితే.. పెళ్లి చేసుకోమనే సరికి ప్రేమించిన వ్యక్తులను మట్టుపెట్టడం మరో ఎత్తు.
ఓ చిన్న పరిచయం.. రెండు సార్లు మాట్లాడి, ఒక చిరు నవ్వు నవ్వితే అది ప్రేమ అనుకుని, చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ.. మోజు తీరాక మోహం చాటేస్తున్నారు. ప్రేమ పేరుతో వంచన చేయడం ఒక ఎత్తు అయితే.. పెళ్లి చేసుకోమనే సరికి ప్రేమించిన వ్యక్తులను మట్టుపెట్టడం మరో ఎత్తు. ఇటీవల కాలంలో ఈ సరికొత్త ప్రేమకథలు తెరపైకి వస్తున్నాయి. ప్రేమ కోసం.. ప్రేమించిన వ్యక్తుల కోసం ప్రాణాలకు సైతం లెక్కచేయని ప్రేమికుడు/ప్రేమికురాలిని చూశాం. కానీ మనం చెప్పుకునే ఈ లవర్.. ప్రేమించిన యువతి ప్రాణాలను తీసేశాడు. తనకు అన్యాయం చేయొద్దని రోదించిన ప్రేయసి పట్ల కఠినాత్ముడు దారుణానికి ఒడిగట్టాడు. హైదరాబాద్ బాచుపల్లిలో యువతి మహిళ హత్య కేసులో చోటు చేసుకున్న పరిణామాలివే.
తనను పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియుడే క్షణికావేశంతో ప్రేయసిని మట్టుబెట్టాడు. వివరాల్లోకి వెళితే.. .కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం నెమలిగుట్టతండాకు చెందిన ప్రమీల (22)కు గతంలో పెళ్లైంది. ఏడాది క్రితం భర్త చనిపోవడంతో ఉపాధి నిమిత్తం బాచుపల్లి ప్రాంతానికి వచ్చింది. స్థానికంగా ఓ షోరూమ్‌లో పనిచేస్తూ.. తన స్నేహితురాళ్లతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో అదే మండలానికి చెందిన సోమరంపేట్ తండాకు చెందిన బాణావత్ తిరుపతి మళ్లీ ఆమెను కలిశాడు. తిరుపతి కొండాపూర్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరికీ గతంలో పరిచయం ఉండటంతో ప్రమీల తిరిగి మాట్లాడటం ప్రారంభించింది. ఇద్దరూ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల తిరుపతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలిసిన ప్రమీల.. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తీసుకురావడం మొదలు పెట్టింది. అయితే మాయమాటలు చెప్పుకుంటూ బతికేశాడు.
ఇటీవల స్వగ్రామానికి వెళ్లి వచ్చిన ప్రమీల శనివారం రాత్రి బయటకు వెళ్లి తిరుపతిని కలిసింది. పెళ్లి విషయంపై వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో.. గాయాలతో రూమ్‌కు వచ్చిందని స్నేహితురాళ్లు చెబుతున్నారు. ఆదివారం ఎప్పుడూ కలుసుకునే బాచుపల్లి వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు రమ్మని చెప్పింది. ఉదయం పరిన్నర ప్రాంతంలో తిరుపతి అక్కడకు రాగా, ఇద్దరూ చాలా సేపు పెళ్లిపై మాట్లాడుకున్నారు. తిరుపతి ఎంతకూ ఒప్పుకోలేదు. చివరకు తాను వెళ్లిపోతున్నానంటూ రోడ్డు దాటుతుండగా.. అతడిని ఫాలో అయ్యింది ప్రమీల. దీంతో ఇద్దరు డివైడర్ మధ్యలో ఆగిపోయారు. అంతలో గండిమైసమ్మ చౌరస్తా వైపు నుంచి బాచుపల్లి వైపు వస్తున్న ఓ ట్యాంకర్‌ను తిరుపతి గమనించాడు. ట్యాంకర్ సమీపంలోని రాగానే ప్రేయసిని తోసేశాడు. దీంతో ట్యాంకర్ ఢీ కొని ప్రమీల అక్కడిక్కడే చనిపోయింది. ఈ సంఘటన ప్రత్యక్షంగా చూసిన కొందరు స్థానికులు 108కు, పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమీల మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. తిరుపతిని అరెస్టు చేశారు.