ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇప్పటి వరకు సీఎం జగన్, షర్మిల తారసపడే సందర్భం రాకపోవడంతో, ఇద్దరి మధ్య సంబంధాలు ఏంటన్నది ఎవరూ బయటకు చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ, ఇప్పుడు ఇడుపులపాయలో జగన్, షర్మిల ఇద్దరూ ఉండటం ఒకేరోజు తండ్రికి నివాళులు అర్పించనుండటంతో అన్నాచెల్లి కలుసుకోవడానికి ఇంతకు మించిన మంచి సమయం ఉండదు. అన్నాచెల్లి కలిసి ఒకే ఫ్రేమ్‌లో నిలబడితే వైఎస్సా్ర్ ఫ్యామిలీలో విబేధాలు ఉన్నాయన్న వార్తలకు చెక్ పడింది. ఒకవేళ ఇద్దరూ కలుసుకోకపోతే జగన్, షర్మిల మధ్య రాజకీయ విబేధాలు ఉన్నట్లుగానే భావించాల్సి ఉంటుందని పలువురు విశ్లేషకులు అనుకున్నారు. దీంతో అన్నాచెల్లి కలయికపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుబసభ్యులంతా ఇడుపులపాయకు చేరుకుని సమాధి వద్ద నివాళి అర్పించారు.
తల్లి విజయమ్మతో కలిసి సమాధి వద్దకు చేరుకున్న ఏపీ సీఎం జగన్, వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిల వైఎస్సార్ కు నివాళి అర్పించారు. ఇడుపులపాయ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12 వ వర్దంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సీఎం జగన్, షర్మిల ఇద్దరు కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులు అర్పించడం గమనార్హం. కొంత కాలంగా సీఎం జగన్ – షర్మిల మధ్య ఏర్పడిన గ్యాప్ తో ఇద్దరూ ఎక్కడ కలిసిన సందర్భాలు లేవు. వైఎస్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేసి సీఎం జగన్, షర్మిల, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.
సీఎం జగన్, షర్మిల ఇద్దరు కలవడం తో అటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మరియు ఇటు వైసీపీ పార్టీ లోనూ నూతన కోలాహలం నెలకొంది. అన్న జగన్ కు రాఖీ కట్టని షర్మిల ఇవాలైన కలిసినందుకు అందరూ సంతోషిస్తున్నారు.