బిగ్ బాస్ సీజన్ 5 పూర్తయ్యింది. టాప్ 5లో నిలిచిన కంటెస్టెంట్స్ అందరూ ప్రసుత్తం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ముందే హౌస్ నుంచి వచ్చిన వారు.. క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ.. షూటింగ్లతో బిజీ అయ్యే ప్రయత్నం లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త ఫిల్మ్ నగర్లో తెగ వైరలవుతోంది. అందేంటంటే.. మెగస్టార్ చిరంజీవి తన అప్ కమింగ్ సినిమాలో మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే తన అప్ కమింగ్ చిత్రం భోళా శంకర్ లో లోబోకి ఓ పాత్ర ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే చ్రితానికి గాను మరో కంటెస్టెంట్ కి కూడా ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది. ఆమెవరో కాదు.. కొరియోగ్రఫర్ అనీ మాస్టర్. ఇన్ని రోజులు తెరవెనక మ్యాజిక్ చేసిన ఈమెకు ఇప్పుడు తెరపై నటించే అవకాశం ఇచ్చాడు చిరంజీవి. వెన్నెల కిషోర్, చిరంజీవి, అనీ మాస్టర్ మధ్య మంచి కామెడీ ట్రాక్ ఉండబోతుందట.
ఇది కూడా చదవండి : బిగ్ బాస్-6 హోస్ట్ గా బాలయ్య? నాగార్జున సైడవుతున్నాడా?
సీఎం కేసీఆర్ సర్ మీకు థాంక్స్! చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!