మంజు వారియర్.. పేరుకి మల్లూవుడ్ స్టార్ అయినా.., తెలుగు వారికి కూడా బాగా తెలిసిన హీరోయిన్. రీ- ఎంట్రీ తరువాత వరుస విజయాలతో అదరగొడుతున్న మంజు.. తాజాగా చతుర్ ముఖం అనే సినిమాలో నటించింది. పైగా.., ఈ చిత్ర నిర్మాణంలోను మంజు వారియర్ భాగం అయ్యింది. కేరళలో ఏప్రిల్ లోనే విడుదలై సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్ర తెలుగు వెర్షన్.. ఇప్పుడు ఆహలో చతుర్ ముఖం పేరుతోనే విడుదల అయ్యింది. మరి.. చతుర్ ముఖం మూవీ రిజల్ట్ ఏమిటో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ:
తేజస్విని స్వతంత్ర భావాలున్న ఓ మధ్య తరగతి మహిళ. ఒకరి కింద ఉద్యోగం చేయడం ఆమెకి ఇష్టం ఉండదు. దీంతో.., తన స్నేహితుడు ఆంటోనితో కలిసి సీసీటీవీ సొల్యూషన్స్ అనే ఓ చిన్న కంపెనీని ప్రారంభిస్తుంది. అయితే.., అనుకోని సంఘటనతో తేజస్వి ఎసెంబుల్డ్ ఫోన్ ఒకటి ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తుంది. ఆ ఫోన్ తేజస్విని చేతుల్లోకి వచ్చినప్పటి నుండి ఊహించని సంఘటనలు జరుగుతాయి. కొంత కాలానికి ఆ ఫోన్ లో ఉన్న ఆత్మ ఈ పనులన్నింటికీ కారణమని తేజశ్విని తెలుసుకుంటుంది. ఇక అక్కడ నుండి తేజస్విని ఈ మిస్టరీని చేధించిందా? లేదా? ఈ ప్రయత్నంలో ఆమెకి ఎవరు సహకరించారు అన్నదే మిగిలిన కథ.
విశ్లేషణ:
ముందుగా ఒక విషయాన్ని క్లియర్ చేసుకుందాం. ఈ చిత్ర పోస్టర్స్ లో వేసినట్టు చతుర్ ముఖం.. సౌత్ లో వచ్చిన ఫస్ట్ టెక్నో హారర్ మూవీ ఏ మాత్రం కాదు. విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన “13B” దీని కన్నా ముందే టెక్నో హారర్ మూవీగా వచ్చి విజయం సాధించింది. కానీ.., చతుర్ ముఖం కథని నడిపించిన తీరు మాత్రం అద్భుతం. మొదట అరగంట వరకు ఇది సాధారణ థ్రిల్లర్ మూవీలా అనిపిస్తుంది. కానీ.., ఎప్పుడైతే హీరోయిన్ చేతులోకి ఆ ఎసెంబుల్డ్ ఫోన్ వస్తుందో అక్కడ నుండి కథ పరుగులు తీసింది. అక్కడ వరకు థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన కథ.. ఒక్కసారిగా హర్రర్ గా టర్న్ తీసుకోవడం ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది.
ఇక ఈ హర్రర్ బ్యాక్ డ్రాప్ కి సైన్స్ ని మిక్స్ చేసిన విధానం కూడా బాగుంది. ఇందులో క్లెమెంట్ పాత్ర దీనికి బాగా ఉపయోగపడింది. ‘చతుర్ ముఖం’కి మరో బిగ్గెస్ట్ ఎసెట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. అక్కడక్కడా సినిమాటిక్ లిబరిటి కాస్త లైన్ క్రాస్ చేసినట్టు అనిపించినా.., కథ సాగే విధానం ఆ ఫీల్ రాకుండా చేసింది. ఇక మంజు వారియర్ తన నటనతో ఈ సినిమాకి ప్రాణం పోసింది. మిగతా పాత్రలు కూడా తమ పరిధి మేర మెప్పించాయి. టెక్నీకల్ గా చతుర్ ముఖం అన్నీ విభాగాల్లో ఆకట్టుకుంటుంది.
ప్లస్:
మైనస్:
చివరి మాట: హర్రర్ మూవీస్ ని ఇష్టపడే వారు తప్పక చూడొచ్చు
రేటింగ్: 3/5