విశ్వక్ నుంచి ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'దాస్ కా ధమ్కీ' విడుదలైన తొలి రోజే విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పటి నుంచి అంటే?
ఇండస్ట్రీలో ఎలాంటి సపోర్ట్ లేకుండా తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు దాస్ కా మాస్ విశ్వక్ సేన్. ఇక విశ్వక్ నుంచి ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ విడుదలైన తొలి రోజే విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించి సంస్థ పోస్ట్ ను సోషల్ మీడియాలో పంచుకుంది. మరి ఏ ఓటీటీలోకి దాస్ కా ధమ్కీ రాబోతుంది? ఏ తారీఖు నుంచి స్ట్రీమింగ్ కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
‘దాస్ కా ధమ్కీ’ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించి, దర్శకత్వం వహించి, నిర్మించిన చిత్రం. ఇందులో హీరోయిన్ గా నివేధాపేతురాజ్ నటించింది. ఉగాది కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తో దూసుకెళ్లింది. తొలి రోజే విశ్వక్ కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టి రికార్డు సృష్టింది. అయితే ధమ్కీ కలెక్షన్లకు బలగం, రంగమార్తండ సినిమాలు షాకిచ్చాయి. దాంతో దాస్ కా ధమ్కీ కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా బలగం సినిమా విశ్వక్ సేన్ కు గట్టి ధమ్కీ ఇచ్చిందనే చెప్పాలి.
దాంతో మే నెలలో ఓటీటీలోకి రావాలి అనుకున్న ధమ్కీ.. కలెక్షన్లు పడిపోవడంతో.. అనుకున్న డేట్ కంటే ముందే ప్రముఖ OTT అయిన ‘ఆహా’లోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి దాస్ కా ధమ్కీ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ ప్రకటించింది. అందుకు సంబంధించిన పోస్ట్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో థియేటర్లలో మిస్ అయ్యిన ప్రేక్షకులు విశ్వక్ సేన్ సినిమాను చూడ్డాని ఎదురుచూస్తున్నారు. ఇక కలెక్షన్ల పరంగా లాభాల్లోకి వెళ్లింది ఈ సినిమా. అయితే అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేదనే చెప్పాలి.