ఏటా దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది చనిపోతున్నారు, కొంత మంది పాక్షిక అంగవైకల్యానికి గురౌతున్నారు. అనారోగ్య సమస్యలతో చనిపోయే వారి కన్నా ఈ రోడ్డు ప్రమాదాల వల్లే మరణించే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని నడి రోడ్డున పడేస్తుంది
ఏటా దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక మంది చనిపోతున్నారు, కొంత మంది పాక్షిక అంగవైకల్యానికి గురౌతున్నారు. అనారోగ్య సమస్యలతో చనిపోయే వారి కన్నా ఈ రోడ్డు ప్రమాదాల వల్లే మరణించే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని నడి రోడ్డున పడేస్తుంది. అతివేగం, మద్యం సేవించి నడపడం, కిలో మీటర్లు కలిసొస్తాయని రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడం వంటి కారణాలే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో ఇంటి పెద్దను కోల్పోతే.. వారిని తిరిగి తీసుకురాలేము కదా.. అతడి కుటుంబం మొత్తం అస్థవ్యస్థం అయిపోతుంది. అందుకే కాస్త ఆలస్యమైనా నెమ్మదిగా ప్రయాణాలు చేయడం మంచిదని సూచిస్తున్నారు అధికారులు.
అయినప్పటికీ ఏదో ఒక మూలన రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అరకు ఎంపీ మాధవి సోదరుడు, వైసీపీ గ్రీవెన్స్ జిల్లా అధ్యక్షుడు మహేష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఉదయం ఎంపీ ఫోటోగ్రాఫర్ రాముతో కలిసి శరభన్నపాలెం నుంచి కొత్తపాలెం మీదుగా ఎర్రబొమ్మలకు బైక్‌పై వెళుతున్నారు. కొత్త పాలానికి చేరుకుంటుండగా.. ఏనుగురాయి దగ్గర డౌన్ దిగుతుండగా.. బ్రేకులు ఫెయిలయ్యాయి. దీంతో వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కన లోతుగా ఉన్న ప్రాంతంలో బోల్తా పడింది. దీంతో వీరిద్దరికీ గాయాలయ్యాయి. మహేష్ ముఖం, తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
అదే సమయంలో అటుగా వస్తున్న ఓ వ్యక్తి గమనించి.. వెంటనే ఎంపీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి వారి వాహనంలో నర్సీపట్నం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్య కోసం విశాఖపట్నం తరలించారు. అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీ మాధవి ఢిల్లీలో ఉన్నారు. సోదరుడికి రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.