స్పెషల్ డెస్క్- పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదో మరిచిపోలేని ఘట్టం. యుక్కవయస్సు రాగానే పెళ్లి గురించి అందరు ఎన్నో కలలు కంటారు. ఇక పెళ్లి తరువాత జరిగే ణరో ముఖ్యమైన కార్యం ఫస్ట్ నైట్. పైకి చెప్పుకోలేరు కానీ, ఫస్ట్ నైట్ గురించి కూడా అందరికి ఎంతో ఆత్రుత, ఎక్సైట్ మెంట్ ఉంటుంది. అది అమ్మాయి అయినా, అబ్బాయి అయినా. చాలా వరకు ఫస్ట్ నైట్ ను సింపుల్ గా చేసేస్తారు. కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం ఫస్ట్ నైట్ ను అచ్చు సినిమాల్లో చేసినట్లే చేస్తారు.
మంచంపై మత్తెక్కించే పూలు, పండ్లు, స్వీట్లు.. ఫస్ట్ నైట్ గదిని అందంగా అలంకరిస్తారు. ఇక గదిలో కళ్ల ముందు ఎన్ని ఉన్నా సరే వారికి ఆకలి వేయదు. రెండు మనసులు కలిసే ఆ ఏకాంత క్షణాలను ఆ ఒక్కరాత్రే కాదు, జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇక ఈ మధ్య కాలంలో పెళ్లిలో జరిగే వింతలు, విశేషాలు సోషల్ మీడియాలో భలే వైరల్ అవుతున్నాయి. ఇక్కడ ఓ ఫస్ట్‌నైట్ వీడియో సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.
ఓ జంటకు పెళ్లి అయిన తరువాత మొదటిరాత్రిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గదిలోని మంచాన్ని పూలతో అలంకరించారు. ఆ గదిలోకి వచ్చి మంచాన్ని చూసిన వధువు ఆశ్చర్యపోయింది. మంచం నిండా పూలను చూసి.. సోయెంగే కహా పే.. అని అంది. అంటే తెలుగులో చెప్పాలంటే.. ఎక్కడ పడుకోవాలి.. అని అమాయకంగా అడిగిందా కొత్త పెళ్లికూతురు.
మంచం నిండా పూలను చూసి కొత్త పెళ్లి కూతురు థ్రిల్‌గా ఫీలవుతుందని భావించిన పెళ్లికొడుకుకు ఆమె ప్రశ్న కాస్త నిరాశ పరిచింది. వధువు పేరు డాక్టర్ ఉపాశన ఒహ్రా. ఈమె ప్రముఖ సినీ నటులు విక్కీ కౌశల్, సన్నీ కౌశల్ దగ్గర బంధువు. ఈ వీడియోను ఆమె బంధువులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయ్యండి.