స్పెషల్ డెస్క్- అందాల భామ, బాలీవుడ్ నటి లిసా హెడెన్ తెలుసు కదా. హిందీలో హౌస్ఫుల్ 2, క్వీన్ తదితర సినిమాల్లో నటించింది లిసా. ఇక 2016లో ప్రముఖ బిజినెస్ మెన్ డినో లల్వానీని పెళ్లాడింది లిసా హెడెన్. వీరికి ఇద్దరు జాక్, లియో మగ బిడ్డలు ఉండగా, తాజాగా మూడో బిడ్డకు జన్మనిచ్చింది లిసా. తమ కుటుంబంలోకి జూన్లో కొత్త అతిధి రాబోతున్నారంటూ ఫిబ్రవరిలో ప్రకటించింది లీసా హెడెన్.
ఆ తరువాత కొన్ని రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తోంది. జూన్ 22న బిడ్డకు జన్మనిచ్చిన లీసా ఆ ఫొటోలు గానీ, ఆడ బిడ్డ, మగ పిల్లాడా అన్న విషయాలను ఎక్కడా తెలియజేయలేదు. ఇక తనకు ముచ్చటగా మూడో బేబీ పుట్టిన కొన్నాళ్ల తరువాత మళ్లీ సోషల్ మీడియాలో యాక్డీవ్ అయ్యింది లిసా హెడెన్. అదిగో అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తూ, తల్లి పాల ప్రాముఖ్యతను, పాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తల్లులకు అవగాహన కల్పిస్తోంది.
తన బిడ్డ పేరు లారా అని మురుపెంగా చెప్పుకొచ్చింది లిసా. అగష్టు 1 నుంచి 7వరకు జరిగిన వరల్డ్ బ్రెస్ట్ ఫీడ్ సెలబ్రెషన్స్ తర్వాత లిసా తన కూతురికి స్వయంగా పాలు పడుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పిల్లలకు తల్లి పాల అవసరం, ప్రయోజనాల గురించి చెప్పుకొచ్చింది లిసా హెడెన్. ఎంతైనా తల్లి మనసు కదా. మరి చంటి బిడ్డల తల్లులు లిసా చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని తమ పిల్లలకు మీ పాలనే ఇవ్వండి. డబ్బా పాలు మాత్రం వద్దు.