టాలీవుడ్ మన్మధుడు నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా బంగార్రాజు అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ. సోగ్గాడే చిన్నినాయనలో నాగ్ డ్యూయల్ రోల్ లో నటించి ఆకట్టుకున్నాడు. ఈ మూవీలో రాముగా, బంగార్రాజు గా నటించిన ఆకట్టుకున్నాడు నాగార్జున. అలాగే నాగార్జున సరసన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ , యంగ్ బ్యూటీ లావణ్య త్రిపాఠీ నటించారు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా బంగార్రాజు క్యారెక్టర్ తో సినిమాను ప్లాన్ చేసుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. ఈ సినిమాలో నటి మోనాల్ గజ్జర్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. స్వర్గంలో ఉండే రంభ పాత్రలో నటిస్తోంది. నాగార్జునతో కలిసి ఒక పాటలో చిందులేయబోతోంది.
బంగార్రాజు సినిమాలో స్వర్గంలో సుదీర్ఘమైన ఎపిసోడ్ ఉంది. ఫాంటసీ ఎపిసోడ్‌లో కొన్ని కామెడీ భాగాలు ఒక పాట ఉంటుంది. మోనాల్ గజ్జర్ భాగం ఈ ఎపిసోడ్‌లో కనిపిస్తుంది. ‘యమగోల’ ‘యమలీల’ తరహాలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సరదా ఎపిసోడ్‌ని రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ‘రంభ.. ఊర్వశి.. మేనక.. అందరినీ కలిపేస్తే నేనిక..’ బెల్లకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అల్లుడు అదుర్స్’. లో ఆడిపాడిన సంగతి తెలిసిందే. ఆ వీడియో తెగ వైరల్ అయ్యింది. ఇందులో ఓ ఐటమ్ సాంగ్‌లో హీరోయిన్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మోనాల్ గజ్జర్ ఆడిపాడింది.
బంగార్రాజు సినిమాలో స్వర్గం లోని సీన్స్ కీలకం కాబోతున్నాయిట. సుదీర్ఘమైన ఎపిసోడ్ ఉందని తెలుస్తోంది. యమలీల తరహాలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సరదా ఎపిసోడ్‌ని రూపొందిస్తున్నారు. ఇటు మోనాల్ అభిమానులు కూడా దీని కోసం వెయిట్ చేస్తున్నారు.