పరమేశ్వరుడిని కొలిచే భక్తులకు ఈ ఒక్క మాటే పరమపావనం. శివ ఆజ్ఞ లేనిదే ఏది జరగదు అంటారు. కానీ.., కొంత మంది నాస్తికులు మాత్రం ఈ నాటికీ నమ్మరు. నిజానికి వారిని నమ్మించాల్సిన అవసరం కూడా లేదు. అయితే.., ఆ దేవ దేవుడు చేసే కొన్ని లీలలు చూస్తుంటే.., ఆయన తన ఉనికిని సామాన్యులకు తెలియచేయాలి అనుకుంటున్నాడా అన్నట్టే ఉంటాయి. తాజాగా ఇలాంటి అద్భుతం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..,
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలంలో రావివలస అనే గ్రామం ఉంది. అక్కడి స్థానిక శివాలయంలో స్వయంభూగా వెలసిన శివలింగం అత్యంత మహిమాన్వితమైనది. ఇక్కడ లింగాకారంలో వెలసిన మల్లిఖార్జునుడికి నిత్యం అన్నీ రకాల పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అయితే.., తాజాగా ఓ భక్తుడికి ఈ శివలింగం కళ్ళు తీర్చి చూస్తున్నట్టు ఓ దృశ్యం కనిపించింది. దీంతో.., ఆ భక్తుడు ఈ దృశ్యాన్ని తన ఫోన్ తో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది భక్తులైతే.., ఇది ఆ శివయ్య మహిమే ఓం నమశివాయ… అంటూ ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. గతంలో ఈ లింగానికి ఓంకార నామం దిద్ది, పట్టు వస్త్రాలతో అలంకరించారు. అయితే.. వాటి మధ్య నుండి స్వామివారు భక్తులను తదేకంగా చూస్తున్నట్టు ఈ దృశ్యం ఉండటం విశేషం. మరి.. ఇది నిజంగా ఆ పరమేశ్వరుడి మహిమకి ప్రత్యక్ష సాక్ష్యమా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.