ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీలు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. పోటా పోటీగా రంగంలోకి దిగాయి. ఒకవైపు అమెజాన్ తమ ప్రైమ్ కస్టమర్లకు.. ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తుంటే.. మరోవైపు ఫ్లిప్‌కార్ట్.. తమ ప్లస్ మెంబర్లకు బిగ్ సేవింగ్ డేస్ సేల్ నిర్వహిస్తోంది. ప్రైమ్ డే సేల్.. 23 నుంచి 24 వరకు 48 గంటలపాటు కొనసాగనుండగా.. బిగ్ సేవింగ్ డేస్ సేల్ జూలై జూలై 23 నుంచి 27 వరకు కొనసాగనుంది. ఏదేమైనాఈ రెండు కంపెనీల మధ్య పోటీ కష్టమర్ల పాలిట వరంగా మారింది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషిన్ లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచులు, క్లాతింగ్, బ్యూటీ ప్రొడక్ట్స్.. ఇలా అన్నింటిపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో కస్టమర్లు తమకు కావలసిన వస్తువులను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్ డిస్కౌంట్స్:
మొబైల్ ఫోన్స్ & యాక్ససరీస్:
ఈ సేల్ లో మొబైల్ ఫోన్స్ వాటి యాక్ససరీస్ పై 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తాయంటూ ప్రకటించింది. ఐఫోన్ మొదలు, వన్ ప్లస్, రెడ్ మీ, రియల్ మీ, ఐకూ, శాంసంగ్, ఒప్పో, వివో వంటి బ్రాండెడ్ మొబైల్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, మొబైల్ హోల్టర్స్, కేబుల్స్, ఛార్జర్స్, పవర్ బ్యాంక్స్, స్క్రీన్ ప్రొటెక్టర్స్ ఇలా అన్నింటిపై 40 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది.
టీవీ & అప్లైన్సెస్:
టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్, డిష్ వాషర్, ఏసీ వంటి వస్తువులపై గరిష్టంగా 60 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. అది కూడా ఐఎఫ్‌బీ, హాయర్, శాంసంగ్, సోనీ, తొషిబా వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై డిస్కౌంట్స్ అందిస్తోంది. అంతేకాకుండా ఎక్స్ ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. మీ ఇంట్లోని పాత వస్తువులను ఎక్స్ ఛేంజ్ చేసుకుని కొత్తవి తీసుకోవచ్చు.
హోం అండ్ కిచెన్:
మీ జీవనాన్ని సులభతరం చేసేందుకు వంటగదిలో, ఇంట్లో ఉపయోగించే గృహోపకరణాలపై అమెజాన్ ప్రైమ్ డే రోజు 70 శాతం వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. కిచెన్ హోం అప్లైన్సెస్ పై 70 శాతం వరకు, హోమ్ డెకార్ వస్తువులపై 70 శాతం వరకు, మ్యాట్రసెస్స్, ఫర్నీచర్ పై గరిష్టంగా 80 శాతం వరకు తగ్గింపు ధరలు ప్రకటించింది.
Amazon Prime Day Salehttps://t.co/fFkZtfuh75 pic.twitter.com/TTIGgT9qzw
— Govardhan Reddy (@gova3555) July 23, 2022
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ డిస్కౌంట్స్:
ఈ సేల్‌లో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్‌లు, స్పెషల్ డీల్స్‌ను పొందవచ్చు. ప్రధానంగా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు తగ్గింపును, టీవీలు, ఇతర ఉపకరణాలపై 70 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఒప్పో, ఆపిల్, వివో, మోటరోలా తదితర స్మార్ట్‌ఫోన్‌లపై తగ్గింపు రేట్లు అందిస్తోంది.
అలాగే హెడ్‌ఫోన్‌లపై 70 శాతం వరకు తగ్గింపును కూడా అందజేయనుంది. మౌస్, రూటర్లు, కీబోర్డులు తదిర కంప్యూటర్ ఉపకరణాలు రూ.99 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. బిగ్ స్క్రీన్ టాబ్లెట్ కొనుగోలు కోసం ఎదురు చూస్తున్న కస్టమర్‌లు 45 శాతం తగ్గింపుతో దీన్ని సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ వాచ్‌లపై 65 శాతం వరకు తగ్గింపు కూడా ఉంటుంది.
అంతేకాదు సేల్ ప్రతిరోజూ అర్థరాత్రి 12 గంటలకు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటలకు తాజా డీల్స్‌ను కూడా ప్రకటిస్తుంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంకు, కోటక్ బ్యాంక్ ,ఆర్‌బిఎల్ బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది.
Flipkart Big Saving Days deals to start from July 23 with heavy discounts and offers, Sale will end on July 27.#feedmile #Flipkart #BigSavingDays #OnlineShopping #OnlineSale #Ecommerce pic.twitter.com/pt4ylYRIcc
— Feedmile (@FeedmileApp) July 18, 2022